‘18న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి’

ABN , First Publish Date - 2020-12-13T05:41:44+05:30 IST

ఈనెల 18న జిల్లాలో గల్ఫ్‌ వలస కార్మికు ల సంక్షేమ బోర్డు సాధన కోసం చేపట్టే రాష్ట్ర సదస్సును జయప్రదం చే యాలని బహుజన లెప్ట్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెం కట్‌ డిమాండ్‌ చేశారు.

‘18న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి’

పెద్దబజార్‌, డిసెంబరు 12: ఈనెల 18న జిల్లాలో గల్ఫ్‌ వలస కార్మికు ల సంక్షేమ బోర్డు సాధన కోసం చేపట్టే రాష్ట్ర సదస్సును జయప్రదం చే యాలని బహుజన లెప్ట్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెం కట్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని శివాజీనగర్‌లో గల బీఎ ల్‌టీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ట్లాడారు. పేదలను టార్గెట్‌ చేసుకుని గల్ఫ్‌ దేశాలకు పంపిస్తామని, నెల కు లక్షల్లో జీతం ఉంటుందని చెప్పి తీరా విజిటింగ్‌ వీసాలపై పంపించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోసం చేస్తున్న గల్ఫ్‌ ఏజెంట్‌లపై చీటింగ్‌ కేసులు నమోదు  చేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నా రని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు, జిల్లా కన్వీనర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T05:41:44+05:30 IST