ఆమె అక్రమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో...
ABN , First Publish Date - 2020-11-03T14:04:23+05:30 IST
నారాయణ భార్య శిరీషతో ఫణీంద్ర వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం నారాయణకు తెలియడంతో...
నిజామాబాద్: జిల్లాలో ఇటీవల జరిగిన జవజీ నారాయణ హత్య కేసులో నిందితులను సోమవారం రూరల్ నార్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో మోపాల్ ఎస్సై పూర్ణేశ్వర్, ఏఎస్సై రమేష్, కానిస్టేబుళ్లు వేణుగోపాల్, సురేందర్, జగదీష్ ఛేదించినట్లు నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. వివరాలను ఆయన ఛాంబర్‌లో విలేకరులకు వెల్లడించారు. నవీపేటకు చెందిన జవజీ నారాయణ నగరంలోని సాయిప్రియనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సిరికొండ మండలం హుస్సేన్‌నగర్‌కు చెందిన పోరుపాక ఫణీంద్ర ప్రసాద్ (వృత్తి విద్యార్థి)తో పాటు అతడి సోదరుడు పోరుపాక మహీంద్ర ప్రసాద్ అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నారాయణ భార్య శిరీషతో ఫణీంద్ర వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం నారాయణకు తెలియడంతో భార్యను మందలించాడు. విషయాన్ని శిరీష ఫణీంద్రకు తెలపడంతో తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, అతడిని ఎలాగైనా తొలగించుకోవాలని భావించారు.
ఫణీంద్రప్రసాద్ పథకం ప్రకారం అక్టోబరు 26న పదునైన కత్తితో నారాయణ కడుపులో పొడిచి, గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తన సోదరుడు మహీంద్రప్రసాద్‌తో క లిసి బైక్‌పై మంచిప్ప శివారులోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ విషయాన్ని శిరీషకు ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో శిరీష తన పిల్లలను తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లింది. అనంతరం ఫ ణీంద్రప్రసాద్ శిరీషకు ఫోన్ ద్వారా ధైర్యం చెప్పి నిజామాబాద్‌కు రమ్మని చెప్పాడు. దీంతో శిరీష తిరిగి వచ్చింది. ఈ కేసుపై అనుమానం ఉండి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు శిరీషను విచారించారు. అదే సమయంలో శిరీష ఇంటికి వచ్చిన ఫణీంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నా రు. దీంతో శిరీషతో పాటు ఫణీంద్రప్రసాద్ అతడి సోదరుడు మ హేంద్రప్రసాద్‌లపై హత్య కేసును నమోదు చేశారు. ఈ కేసును త్వరగా ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ప్రోత్సాహ క బహుమతి కోసం ఉన్నతాధికారులకు విన్నవిస్తానని చెప్పారు.