మత్స్యకార్మికుల ఉద్ధరణకు సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2020-12-17T05:37:24+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికు ల ఉద్ధరణ కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని జు క్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు.

మత్స్యకార్మికుల ఉద్ధరణకు సంక్షేమ పథకాలు

నిజాంసాగర్‌, డిసెంబరు 16: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికు ల ఉద్ధరణ కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని జు క్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. బుధవారం నిజాంసా గర్‌ జలాశయంలో వందశాతం రాయితీపై నీలకంఠ రొయ్య పి ల్లలను విడుదల చేశారు. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరా నికి నిజాంసాగర్‌, కౌలాస్‌ నాలా, అడ్లూర్‌ ఎల్లారెడ్డి ప్రాజెక్టులో 28లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళిక రూ పొందించారని, మొదటి విడత నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 14 ల క్షల రొయ్య పిల్లలను విడుదల చేశామని తెలిపారు. దళారులకు విక్రయించకుండా మత్స్యకార్మికులే అమ్ముకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదా ర్‌ శోభ అన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ అదనపు సంచాలకులు శంకర్‌ రాథోడ్‌ మాట్లాడుతూ ఈ యేడాది 5కోట్ల రొయ్య పిల్ల లను జనవరిలో విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించా మని, ఇప్పటివరకు 2కోట్ల80 లక్షల రొయ్య పిల్లలను జలాశయా ల్లో విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షుడు గైని విఠల్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి,  సర్పంచులు సంగవ్వ, అనసూయ, మత్స్యపారిశ్రామిక సహకార సంఘ ఉపా ధ్యక్షుడు రాములు, జిల్లా మత్స్యశాఖాధికారిణి పూర్ణిమ, ఎఫ్‌డీ వో డోల్‌సింగ్‌, ఎంపీడీవో పర్బన్న, ఎంపీటీసీ దేవదాస్‌, తదితరులున్నారు.

Updated Date - 2020-12-17T05:37:24+05:30 IST