ఆశల పల్లకిలో వీవీలు

ABN , First Publish Date - 2020-12-17T05:42:21+05:30 IST

త్వరలో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. డిసెంబరు చివరి వారంలో లేదంటే జనవరిలో 9,10వ తర గతి విద్యార్థులకు బోధన నిర్వహించడంపై దృష్టి సారించిందని సమాచారం.

ఆశల పల్లకిలో వీవీలు

రెన్యూవల్‌ కోసం విద్యావలంటీర్ల ఎదురుచూపులు ఠి త్వరలో స్కూళ్లలో ప్రత్యక్ష బోధనకు అవకాశం
గత సంవత్సరం జిల్లాలో 700 మంది వీవీలు విధుల నిర్వహణ

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 16:
త్వరలో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. డిసెంబరు చివరి వారంలో లేదంటే జనవరిలో 9,10వ తర గతి విద్యార్థులకు బోధన నిర్వహించడంపై దృష్టి సారించిందని సమాచారం. ఇప్పటి వరకు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారం భం కాని నేపథ్యంలో విద్యావలంటీర్లను ఈ సంవత్సరం రెన్యూవల్‌ చేయలేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీవీలను రీఎంగేజ్‌ చేయాలనే వినతుల నేపథ్యంలో వీరంద రిని రెన్యూవల్‌ చేసేందుకు గతంలోనే విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా వ్యాప్తంగా 2018-19 విద్యా సంవత్సరంలో వీవీలను నియమించగా, 2019-20 విద్యా సంవత్సరంలో వీరందరిని రెన్యూవల్‌ చేసింది. ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూసి ఉన్నాయి. 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన జరగ డం లేదు. కాగా ఈ సారి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 700లకుపై చిలుకు మంది విద్యావాలంటీర్లు అవసరమని విద్యాశాఖధికారులు గుర్తించారు.
జిల్లాలో 1,011 పాఠశాలలు
జిల్లాలోని మొత్తం 1,011 ప్రభుత్వ పాఠశాలల్లో 80,000మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు వీవీల బోధన అవసరం ఉంది. మారుమూల తండాలు, గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక విద్యాబోధన కుంటుపడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తామని ఒకవైపు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏళ్ల నుంచి బోధకుల కొరత కారణంగా పాఠాలు బోధించే వారు కరువయ్యారు. గతేడాది జిల్లాలో టీఆర్‌టీ ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరినా ఇంకా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో ప్రభుత్వం ఏటా విద్యా వాలంటీర్లను నియమిస్తోంది.
సమయానికి అందని వేతనాలు
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండొద్దని ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో విద్యావలంటీర్లను నియమించారు. సర్కా రు ఉపాధ్యాయులతో సమానంగా పాఠాలు బోధించే వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అందించేవే అరకొర వేత నాలు కాగా అవి సమయానికి ఇవ్వడంలేదని విద్యా వాలం టీర్లు వాపోతున్నారు. అయితే బడ్జెట్‌ లేదనే సాకుతో నెలనెల చెల్లించాల్సిన వేతనాలు మూడు, నాలుగు నెలలకో సారి అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మా చారెడ్డి, లింగంపేట మండలాల్లో వీవీలకు దాదాపు 9 లక్షల వరకు వేతనాలు ఇంకా రావాల్సి ఉందని సమాచారం. దీంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని విద్యావలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పష్టత రాలేదు
ఫ రాజు, డీఈవో, కామారెడ్డి
పాఠశాలల్లో డిసెంబరు లేదా జనవరిలో ప్రత్యక్ష బోధన ప్రారంభంపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగ తులు కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాలల్లో ఖాళీలకు సంబంధించి జూన్‌లోనే వివరాలు అందజేశాం. గతేడాది 700 మంది వరకు వీవీలు పని చేశారు. ఈ ఏడాది ఎంత మంది అవసరం ఉంటుందో పాఠశాలలు తెరిచిన తర్వాతే నిర్ణయం జరుగుతోంది.

Updated Date - 2020-12-17T05:42:21+05:30 IST