గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేస్తాం
ABN , First Publish Date - 2020-12-04T05:23:44+05:30 IST
గ్రామ గ్రామానా బీజేపీని బలోపేతం చేస్తామని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ
నిజాంసాగర్, డిసెంబరు 3: గ్రామ గ్రామానా బీజేపీని బలోపేతం చేస్తామని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండ లంలోని అచ్చంపేట గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీని మరిం త బలోపేతం చేస్తామన్నారు. రైతులు కష్టపడి పండించిన సన్నరకం వరి ధాన్యాని కి గిట్టుబాటు ధర లేదని, గ్రామ పంచాయతీల నిర్మాణాలకు నిధులను కేంద్ర ప్ర భుత్వమే అందిస్తోందన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, బడుగు, బలహీన వ ర్గాల శ్రేయస్సు కోరే పార్టీ అని జిల్లా అధ్యక్షురాలు అరుణతార తెలిపారు. గ్రామాల్లో గ్రామ కమిటీలు కూడా వేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జయ శ్రీ, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, మాజీ జిల్లా పరిష త్ చైర్మన్ కాటెపల్లి వెంకట రమణా రెడ్డి, బీజెపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.