‘ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’

ABN , First Publish Date - 2020-11-27T05:59:07+05:30 IST

ఎన్టీఆర్‌ సమాధిని కూల్చివేయాలన్న అక్బరుద్ధీన్‌ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌ అన్నారు.

‘ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’
దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

సుభాష్‌నగర్‌, నవంబరు 26: ఎన్టీఆర్‌ సమాధిని కూల్చివేయాలన్న అక్బరుద్ధీన్‌ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం ఎ దుట గురువారం అక్బరుద్ధీన్‌ ఓవైసీ  దిష్టిబొమ్మను దహ నం చేశారు. అక్బరుద్దీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లిన ఎన్టీఆర్‌ సమాధిని కూల్చివేస్తానడం సిగ్గుచేటన్నారు. మీ కచరా రాజకీయాలు టీఆర్‌ఎస్‌ పార్టీపైన చూపించుకోవాలన్నారు. మీ సొంత నియోజకవర్గం పరిస్థితిని చూ సుకోవాలని ఎన్టీఆర్‌ సమాధిని కాదు కదా తెలుగుదేశం పార్టీ కండువాను కూడా ఏమిచేయలేవని విమర్శించారు. మీ స్థాయికి ఎన్టీఆర్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. మీ చి ల్లర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ముందు కాదని మీ నియోజకవర్గంలో చూపించుకోవాలని హెచ్చరించారు. కా ర్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెంజర్ల సురేష్‌, తెలు గు యువత రాష్ట్ర కార్యదర్శి సంజయ్‌, లవంగరాజు, శంక ర్‌, రవి, ఫిరోజ్‌, అశోక్‌, రణవీర్‌రెడ్డి పాల్గొన్నారు.   


Read more