జిల్లాకు జలకళ

ABN , First Publish Date - 2020-08-16T10:17:57+05:30 IST

జిల్లాలో గడిచిన ఆరు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది

జిల్లాకు జలకళ

జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు 

మోపాల్‌ లో 70 మి.మీ. వర్షపాతం

శ్రీరామసాగర్‌కు కొనసాగుతున్న వరద


నిజామాబాద్‌,  ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో గడిచిన ఆరు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. కొన్ని వాగులు పొంగుతుండగా చెరు వులు అలుగులు పారుతున్నాయి. చెక్‌డ్యాంలు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాలకు భూగర్భజలాలు పెరుగుతుండగా ఆరుతడి పంటలతో పాటు వరి సా గుచేసిన రైతులకు నీటి కొరత లేని పరిస్థితులు ఏర్ప డ్డాయి. జూన్‌, జూలై నెలలో తక్కువగా వర్షం పడగా ఈ నెలలో కొద్దిగా ఎక్కవగానే పడుతోంది. జిల్లాలోని కప్పలవాగు, పెద్దవాగు, పూలాంగ్‌వాగుకు వరద కొన సాగుతోంది. మంజీరకు వరద వస్తోంది. కొన్ని ప్రాం తాలలో చెరువులు నిండి మత్తడులు పారుతున్నాయి. జిల్లాలో శనివారం 22.2 మి.మీ. వర్షపాతం నమోదైం ది. మోపాల్‌ మండలంలో 70 మి.మీ. వర్షం పడింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 587 మి.మీ. వ ర్షం పడాల్సి ఉండగా.. 549 మి.మీ. వర్షం పడింది. జి ల్లాలోని 29 మండలాల్లో నాలుగింట్లో సగటు వర్షం కంటే తక్కువగా పడింది. 20 మండలాలలో సగటు వర్షపాతం నమోదు కాగా.. 5 మండలాల్లో సగటు వర్షానికి మించి వర్షం పడింది.


ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద 

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు గోదావరి ద్వారా వరద కొ నసాగుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తు న్న వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు నిర్మల్‌ జిల్లాలో పడుతున్న వర్షాలకు జూన్‌ నుంచి ఇప్పటి వరకు 28.89 టీఎంసీల నీరు వచ్చింది ప్రాజెక్టులోకి 13 వేల క్యూసెక్కుల వరద కొనసాగు తోంది. గడిచిన కొన్ని రోజులుగా ప్రాజెక్టులోకి ప్రతీ రో జు టీఎంసీకి పైగా నీళ్లు చేరుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగులకుగాను 1076.10 అడుగు ల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను 42.452 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వర్షాలు పడుతున్నా ఆయకట్టుకు కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వా రా నీటి విడుదల చేస్తున్నారు. వీటితో పాటు గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతలకు నీరందిస్తున్నారు. వర్షాలు ప డుతుండంతో ప్రతిరోజు వరద వస్తోందని ప్రాజెక్టు ఈఈ రామారావు, డీఈ జగదీష్‌లు తెలిపారు. మరి కొన్ని రోజులు ఈ వరద కొనసాగుతుందన్నారు. ప్రభు త్వ ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదలను కొన సాగిస్తున్నామని తెలిపారు.


ఉధృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగు   

కమ్మర్‌పల్లి: మండలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండకోనల్లో గల గుట్టల నుంచి  జాలువారిన నీటితో ఓవైపు గట్టుపొడిచిన వాగు మరోవైపు కోనాపూర్‌ రాళ్లవాగు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అడపాదడపా కురుస్తున్న ముసురుకు రాళ్లవాగు ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతుండగా, గట్టుపొడిచిన వాగు పొంగిపొర్లుతోంది. రాళ్లవాగు పొ ంగడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా కోనాపూర్‌కు చెందిన 700 ఎరకరాలకు, జగిత్యాల జిల్లా కథలాపూర్‌, భూషన్‌రావుపేట్‌, పెగ్గెర్ల, ఊట్‌పెల్లి గ్రామాలకు చెందిన సుమారు 2,800 ఎకరాలకు సాగునీరందు తుంది. 


తెగిపోయిన తాత్కాలిక వంతెన

సిరికొండ: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండూర్‌ వద్ద కప్పలవాగుపై గల తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో కొండూర్‌, సిరికొండ, వాల్గోట్‌ గి ర్ని మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్ర స్తుతం బస్సులు హొన్నాజిపేట్‌-గడ్కోల్‌, పెద్దవాల్గో ట్‌ - చిన్నావాల్గోట్‌ నుంచి సిరికొండ, రావుట్లకు  తిప్పుతు న్నారు.

 

తూంపల్లి వద్ద తెగిపోయిన మాటుకాలువ

శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సిరికొండ మండలం తూంపల్లి ఊర చెరువులోకి నీటి మళ్లింపు కోసం తవ్విన మాటు కాలువ తెగిపోయింది. మండ లంలోని అన్ని గ్రామాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆనందం చిగురించి. శుక్ర వారం రాత్రి భారీ వర్షం కురువడంతో మండలంలోని ప్రధానవాగు కప్పల వాగు వరదనీటితో నిండుగా ప్ర వహిస్తోంది. కప్పల వాగుకు జన్మస్తానమైన తూంపల్లి వద్ద ఊరచెరువులోకి నీటిని మళ్లించడానికి నిర్మించిన మాటుకాలువ వరద ప్రవహానికి తెగిపోయింది. దీని వల్ల పలువురు రైతుల పొలాలు వరద నీటిలో ముని గిపోయాయి.


పొలాల్లో ఇసుక మేటవేసింది. వరి నేల వాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరినాట్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయని రైతులు చెప్పా రు. పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించాల ని పలువురు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది లా ఉండగా.. శుక్రవారం కురిసిన వర్షానికి మండలం లోని వాగులు వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్నా యి. చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటల్లోకి వరద నీళ్లు చేరాయి. కొండపూర్‌, తూంపల్లి, పోత్నూర్‌ గ్రామాల్లోని చెరువులు నీటితో నిండాయి. రావుట్ల, పెద్దవాల్గోట్‌, చిన్నవాల్గోట్‌, కొండూర్‌ గ్రామాల్లోని చెరువుల్లోకి నీళ్లు సగానికి చేరినట్లు ఆయా గ్రామాలకు చెందిన వారు తెలిపారు. 

 

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో వర్షాలు విస్తారంగా  కురుస్తూ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయని, దీని వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఆదుకునేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపా రు. ఈ కంట్రోల్‌ రూం 24 గంటల పాటు పనిచేస్తుందని, ప్రజలకు వర్షాల వల్ల ఎటువంటి అసౌకర్యం కలిగినా 08462-220183 నెంబర్‌కు ఫోన్‌ ద్వారా లేదా డీఆర్‌వోఎన్‌జడ్‌బీ911ఎట్‌దిరేట్‌ఆఫ్‌జీమెయిల్‌.కామ్‌కు ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేయాలన్నారు. 

Updated Date - 2020-08-16T10:17:57+05:30 IST