పల్లెల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-06-22T11:11:05+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తు ండంతో ఆర్మూర్‌ ప్రాంతంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.

పల్లెల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తితో అప్రమత్తమవుతున్న గ్రామస్థులు 

మగ్గిడి, ఫత్తేపూర్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ 

కుదేలవుతున్న వ్యాపారాలు


ఆర్మూర్‌, జూన్‌ 21: కరోనా వైరస్‌ విజృంభిస్తు ండంతో ఆర్మూర్‌ ప్రాంతంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. మొదట ల్లో పట్టణాలకే పరిమితమైన కరోనా ప్రస్తుతం పల్లెలకు పాకింది. దీంతో గ్రామీణులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్మూర్‌ మండ లం మగ్గిడి గ్రామంలో ఐదుగురికి కరోనా వైరస్‌ సోకడంతో చుట్టు పక్కల గ్రామాల వారు అప్ర మత్తమయ్యారు. మగ్గిడి గ్రామంలో మొదట ఒక వ్యక్తికి రాగా అతని ద్వారా మరో నలుగురికి సోకి ంది. అతనితో పాటు కుటుంబీకులకు ముగ్గరుకి స్నేహితుడికి పాజిటీవ్‌ వచ్చింది. దీంతో అదే గ్రా మానికి చెందిన 108 మందిని హోమ్‌ క్వారెంటైన్‌ లో ఉంచారు. మగ్గిడి గ్రామానికి పక్కనే ఉన్న ఫత్తేపూర్‌ గ్రామంలో 18వ తేది నుంచి లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. గ్రామంలో దుకాణాలు, హోటళ్ల ను మూసివేశారు. కిరాణ దుకాణాలకు సమ యాలు నిర్ణయించారు. ఇతర గ్రామాల వారు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు.


గ్రామస్థులు కూడా బయటకు వెళితే చర్యలు తీసు కోవాలని వీడీసీ సభ్యులు సూచించారు. ఆలూర్‌ గ్రామంలో కూడా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. చు ట్టు పక్కల గ్రామాల్లో కూడా ఇష్టారాజ్యంగా వ్య వహరించడం లేదు. ప్రభుత్వం అన్ని సడలింపు లు ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం ముందు జా గ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లో పది కేసులు వెల్లడి కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆర్మూర్‌కు చెందిన వ్యాపారికి క రోనా సోకగా ఆయన ద్వారా తల్లికి కూడా వచ్చిం ది. వ్యాపారి కామారెడ్డిలో విందుకు వెళ్లగా అక్క డ సంక్రమించినట్లు తెలుస్తోంది. మోర్తాడ్‌కు చెం దిన టీఆర్‌ఎస్‌ నాయకుడికి కరోనా రాగా అతని తో తిరిగిన వారందరు ఆందోళనకు గురవు తున్నారు. 


వ్యాపారులకు తప్పని నష్టాలు..

కరోనా ప్రభావం వ్యాపార రంగం మీద తీవ్రం గా కనిపిస్తోంది. కరోనా ప్రభావం కంటే ముందు బాగా నడిచిన వ్యాపారాలు ప్రస్తుతం కరోనా ప్ర భావంతో అంతగా నడవడంలేదు. భారీగా ఉన్న అద్దెలను చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం ఉంది. సినిమా హాల్లు, ఫంక్షన్‌హాల్‌లు అసలు తె రవడం లేదు. ఆర్మూర్‌ పట్టణం టిఫిన్‌ సెంటర్‌ లు ప్రసిద్ధి. అన్ని టిఫిన్‌ సెంటర్‌లు ప్రతీ రోజు రద్దీగా ఉండేంది. ప్రస్తుతం కస్టమర్‌లు లేక వెల వెలబోతున్నాయి. గతంలో జరిగిన టర్నోవర్‌లో 30 శాతం కూడా జరగడం లేదని టిఫిన్‌ సెంటర్‌ యజమానలు తెలుపుతున్నారు. గతంలో ఇళ్లకు పార్శిల్‌ తీసుకెళ్లేవారు ఇప్పుడు తీసుకెళ్లడం లేదు. ముంబైకి బస్సులు నడవనందున ట్రావెల్స్‌ మూ సివేశారు. ఆటోల యజమానులు ప్రయాణీకులు లేక తీవ్రంగా నష్టపోతున్నారు.


ప్రైవేట్‌, ఫైనాన్స్‌ లలో రుణాలు తీసుకుని ఆటోలు కొన్నామని వా యిదాలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నా రు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యాపారాలు చేస్తున్న వారి పరిస్ధితి మరి దారుణంగా తయారైంది. టెండర్‌ లో మడిగ దక్కించుకున్న వారు తీవ్ర ఆర్థిక న ష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో బస్సులు నడిస్తేనే వ్యాపారాలు నడుస్తాయి. కరో నా వల్ల మూడు నెలలు బందులు ఉండగా గత ంలో రెండు నెలలు కార్మికుల సమ్మె వలన పూర్తి స్థాయిలో బస్సులు నడవలేదు. దీంతో వ్యాపారా లు సాగలేదు. కరోనా వల్ల ప్రైవేట్‌ వారు మూడు నెలలు అద్దె వసూలు చేయవద్దని సీఎం కేసీఆర్‌ సూచించారు. బలవంతంగా వసూలు చేస్తే కేసు లు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కానీ ఆ ర్టీసీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుం డా నోటీసులు జారీ చేశారు. దీంతో వ్యాపారులు దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్నారు. 

Updated Date - 2020-06-22T11:11:05+05:30 IST