అంగరంగ వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2020-12-30T05:20:51+05:30 IST
మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమ ంలో మంగళవారం వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తాడ్వాయి, డిసెంబరు 29: మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమ ంలో మంగళవారం వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శబరిమాత, దత్తాత్రేయ ఉత్సవాల సందర్భం గా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వేదపండితులు కన్నుల పండువగా నిర్వహిం చారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే సుప్రభాత సేవ, ధ్యానం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. శబరిమాతా స్వయంగా ఆలపించిన భక్తిపాటలను భక్తులు ఆలపించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారి పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. మండలం లోని వివిధ గ్రామాల నుంచే కాకుండా జిల్లాలోని వివిధ మండలాలు, ఇతర జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్ర మంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.