టీయూ తెలుగు విభాగంలో ఇద్దరికి పీహెచ్‌డీ ప్రదానం
ABN , First Publish Date - 2020-11-25T04:55:03+05:30 IST
టీయూ తెలుగు అధ్యాయణ శాఖలో ఇద్దరు పరిశోధక విద్యార్థులకు మంగళవారం పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ విభాగం పీఠాధిపతి ఆచార్య కనకయ్య పర్యవేక్షణలో పరిశోధన విద్యార్థి సయ్యద్ అఫ్రిన్ బేగం, ‘తెలంగాణ నవల రచయిత్రులు ఒక పరిశీల న’ అనే అంశంపై పీహెచ్‌డీ అందుకున్నా రు.
డిచ్‌పల్లి, నవంబరు 24: టీయూ తెలుగు అధ్యాయణ శాఖలో ఇద్దరు పరిశోధక విద్యార్థులకు మంగళవారం పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ విభాగం పీఠాధిపతి ఆచార్య కనకయ్య పర్యవేక్షణలో పరిశోధన విద్యార్థి సయ్యద్ అఫ్రిన్ బేగం, ‘తెలంగాణ నవల రచయిత్రులు ఒక పరిశీల న’ అనే అంశంపై పీహెచ్‌డీ అందుకున్నా రు. మరో పరిశోధక విద్యార్థి శేఖ్ అక్బర్ పా షా ‘వరంగల్ జిల్లా తెలుగు సాహిత్య వికా సం’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథలు రూపొందించి విశ్వవిద్యాలయానికి సమర్పించారు. వర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సమావేశ మందిరంలో ఉస్మానియా వి శ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి ఆచార్య వెలుదండ నిత్యనందరావు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ నుంచి ఆచార్య గోన నాయక్ ఎక్ట్సర్నల్ ఎక్సామినర్ గా వచ్చి ఓపేన్ వైవా నిర్వహించి పరిశోధక విద్యార్థులను వారివారి పరిశోధన అంశాలపై సమాధానాలు రాబట్టారు. ఈ ఓపెన్ వైవా కార్యక్రమానికి తెలుగు అధ్యాన శాఖ అధ్యా పకుడు డాక్టర్ బాల శ్రీనివాస మూర్తి డాక్టర్ త్రివేణి, డాక్టర్ లావణ్య, డాక్టర్ లక్ష్మణ చక్ర వర్తి, ఇతర విభాగాల అధ్యాపకులు పాల్గొ న్నారు. ఇద్దరు పరిశోధక విద్యార్థలు మైనార్టీలు కావడం తెలుగు సాహిత్యంలో ఎంఏ అభ్యసించి సీహెచ్‌డీ పట్టా పొందడం పట్ల వైస్ చాన్స్‌లర్ నీతూ కుమారీ ప్రసాద్, రిజిస్ర్టార్ ఆచార్య నసీం విద్యార్థులను అభినందించారు.
వృక్షశాస్త్ర విభాగంలో ఒకరికి
టీయూ వృక్షశాస్త్ర విభాగంలో మంగళవారం పీహెచ్‌డీ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. వృక్షశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ అరుణ పర్యవేక్షణలో నాగ సమీర అనే విద్యార్థిని బయోటైవర్సీటీ ఆఫ్ అలికేయిన్ అశోక్‌సాగర్, అలీసాగర్ ఆఫ్ నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన గ్రంఽథాన్ని సమర్పించారు. టీ యూ సెమినార్ హాల్‌లో జరిగిన పీహెచ్‌డీ వైవాకు డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ మరఠా విశ్వవిద్యాలయం, ఔరంగ బాద్‌కు చెందిన ఆచార్య సహేర నస్రీన్ విషయ నిపుణు లుగా వ్యవహరించారు. పరిశోధక విద్యార్థిని తన పరిశోధ న ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివ రించారు. జిల్లాలోని అశోక్ సాగర్, అలీసాగర్‌లో పెరుగుతున్న శైవలాలు వాటి అభివృద్ధి వాటి మార్పులు గురించి వివరించారు. దీనికి సంతృప్తి చెందిన ప్రొఫెసర్‌లు డాక్టరేట్ ప్రకటించారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ అబ్దుల్ అలీం, డాక్టర్ ఎం.అరు ణ, డాక్టర్ విద్యావర్ధిని, డాక్టర్ దేవరాజు, జలందర్, తదితరులు పాల్గొన్నారు.