రైలులో బంగ్లాదేశ్‌కు పసుపు రవాణా
ABN , First Publish Date - 2020-06-22T11:13:10+05:30 IST
జిల్లాలో పండిచన పసుపును తొలిసారి సరుకు రవాణా రైలులో ఆదివారం బంగ్లాదేశ్‌లోని బీ న్‌పోల్‌కు తరలించినట్టు

మొదటిసారి పసుపు లోడుతో వెళ్లిన రైలు
నిజామాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో పండిచన పసుపును తొలిసారి సరుకు రవాణా రైలులో ఆదివారం బంగ్లాదేశ్‌లోని బీ న్‌పోల్‌కు తరలించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధి కారి సిహెచ్ రాకేష్ ఒక ప్రకటలో తెలిపారు. ప్రస్తుత కరోనా విపత్కర స మయంలోనూ రైలు రేక్‌లోడ్ చేసి పంపండం జరిగిందని ఆయన తెలిపా రు. ఇప్పటి వరకు రోడ్డు మార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు పసుపును రవాణా చేసేవారని, ఇది ఖర్చుతో కూడిన పనితోపాటు సమయం కూడా ఎక్కువ పట్టేదని, దీంతో హైదరాబాద్ డివిజన్ రైల్వే అధికారులు చొరవ తీసుకొని వినియోగదారులను కలిసి, రైల్వేలో అమలుచేస్తున్న రాయితీలతో 42 బీసీ ఎన్‌లలో 2,474 టన్నుల పసుపును బంగ్లాదేశ్‌లోని బీన్‌పోల్‌కు తరలించ డం జరిగిందని, ఈ సందర్భంగా అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించినట్టు ఆయన తెలిపారు.