టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి బీజేపీలోకి వలసలు

ABN , First Publish Date - 2020-12-14T05:24:55+05:30 IST

మండలంలోని సజ్జన్‌పల్లి, శెట్పల్లి, కొర్పోల్‌ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి బీజేపీలోకి వలసలు
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

లింగంపేట, డిసెంబరు 13: మండలంలోని సజ్జన్‌పల్లి, శెట్పల్లి, కొర్పోల్‌ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. వీరిలో కొర్పోల్‌ వార్డు సభ్యుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చాకలి మల్లయ్యతో పాటు మరికొం త మంది, సజ్జన్‌పల్లికి చెందిన 15మంది, శెట్పల్లికి చెందిన నలుగురు మొత్తం 25మంది వరకు పార్టీలో చేరినట్లు పార్టీ మండల అధ్యక్షుడు దత్తురాంలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీ బాణాల లక్ష్మారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీ వెంకటరమణారెడ్డి, నాయకులు రాంచందర్‌, బొల్లారం సాయిలు, మురళి, నారాయణలతో పాటు మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.
అన్నారంలో..
రామారెడ్డి: మండలంలోని అన్నారం గ్రామంలో ఆదివారం బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జీ  కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యం లో 53మంది యువకులు బీజేపీలో చేరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభు త్వం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకా లు, బీజేపీ సిద్ధాంతాలు నచ్చి అనేక మంది యువకులు బీజేపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నా యం కేవలం బీజేపీ అని వారు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-14T05:24:55+05:30 IST