ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా.. పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-31T05:22:05+05:30 IST

శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యాయి.

ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా.. పలువురికి గాయాలు

దోమకొండ, డిసెంబరు 30: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యాయి. దోమకొండ ఏఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌లో అదే గ్రామానికి చెందిన వారు దుబ్బాక మండలంలోని బల్వంతపూర్‌లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి చింతమాన్‌పల్లి వస్తుండగా ముత్యంపేట వద్ద ఉన్న దొంగలమర్రి మూలమలుపులో డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ట్రాలీ బోల్తా పడింది. పది మందికి గాయాలుకావడంతో దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.

Updated Date - 2020-12-31T05:22:05+05:30 IST