గ్రీన్‌ జోన్‌ దిశగా..

ABN , First Publish Date - 2020-05-09T11:19:19+05:30 IST

జిల్లాలో కరోనా భారిన పడ్డ 12 మంది కోలుకున్నారు. ఏప్రిల్‌ 12 నుంచి జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. జిల్లాలో 12 మందిలో 11 మంది బాన్సువాడ

గ్రీన్‌ జోన్‌ దిశగా..

ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లోకి రానున్న జిల్లా

గ్రీన్‌ జోన్‌గా అధికారిక ప్రకటనే తరువాయి..

జిల్లాలో 28 రోజులుగా కరోనా కేసుల్లేవ్‌

కుదుట పడుతున్న కామారెడ్డి

జిల్లాలో 568 వలస కూలీల గుర్తింపు

జిల్లా నుంచి 96 మంది వలస కూలీల తరలింపు

జిల్లాలో తెరుచుకున్న దుకాణాలు


కామారెడ్డి జిల్లాను ఇక గ్రీన్‌ జోన్‌ జిల్లాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత 27 రోజులుగా జిల్లాలో కరో నా కేసులు నమోదు కాలేదు. ఇది వరకు ఈ వైరస్‌ భారినపడ్డ వారిలో అనేక మంది కోలుకున్నారు. మిగతావారు ఆస్పత్రుల్లో చికిత్స పొంది బయటకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగిస్తుండటంతో జిల్లాలో కరోనా వ్యాప్తి నుంచి క్రమంగా కోలుకొని ఇప్పుడిప్పుడే కుదుటప డుతోంది. కరోనా వ్యాధి నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మే 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌ వైపు పయనిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం, ప్రజలు హాయి గా ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారికంగా కామారెడ్డి జిల్లాను గ్రీన్‌ జోన్‌గా ప్రకటించాల్సి ఉంది. 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉంటే జోన్లలో మార్పు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఆరేంజ్‌ జోన్‌లో ఉండగా ప్రస్తుతం 27 రోజుల నుంచి కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాకపో వడంతో కామారెడ్డి జిల్లా త్వరలోనే గ్రీన్‌ జోన్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. 


కామారెడ్డి, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా భారిన పడ్డ 12 మంది కోలుకున్నారు. ఏప్రిల్‌ 12 నుంచి జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. జిల్లాలో 12 మందిలో 11 మంది బాన్సువాడ ప్రాంతానికి చెందిన వారు కాగా ఒక్కరు మాత్రం కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలో ని దేవునిపల్లికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. వారు చికిత్స పొంది కోలు కున్నారు. కొత్తగా కేసులు నమోదు కావడం లేదు. జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తూ భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. వాహ నాల తనిఖీలు చేపడుతున్నారు. గత నెలలో నమో దైన పాజిటివ్‌ కేసుల వారంతా నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వారు ఇళ్లలోకి వచ్చేశారు. విదేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని జిల్లా అధికారులు 568 మందిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు.


జిల్లాలో మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన వారిలో నుంచే 11 మందిలో 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విధిత మే. వారి నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ద్వారా మరికొందరికి వైరస్‌ వ్యాప్తి చెందుతుందని భావించిన జిల్లా అధికారులు వారు ఉండే ప్రాంతా లను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌ వచ్చే వరకు ఆ ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. తరువాత ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌గా మార్చారు. కామారెడ్డి జిల్లా ఆరేంజ్‌ జోన్‌ దశ నుంచి గ్రీన్‌ జోన్‌ దశకు రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటుంది. కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతా ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం కరోనా వైరస్‌ నియంత్రణపై ప్రభుత్వ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు.


నిబంధనల ను అతిక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరి స్తున్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌లో కొనసాగిం   చాలని కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత జిల్లా ప్రజలను కోరుతున్నారు. ఓ దశలో జిల్లా రెడ్‌జోన్‌లోకి వెళ్లినప్పటికీ పాజిటివ్‌ కేసుల నుంచి అందరూ కోలుకోవ డంతో క్రమంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. కొత్త కేసులు లేకపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు డిశ్చార్జి కావడంతో కరోనా జిల్లాలో తగ్గుముఖం పట్టింది.


ఇదీ పరిస్థితి..

కామారెడ్డి పట్టణం దేవునిపల్లితో పాటు బాన్సువాడలో పాజిటివ్‌ కేసులు గత మాసంలో నమోదు అయ్యాయి. ప్రస్తుతం వీరిలో మొత్తం మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆయా ప్రాంతాలు ఫ్రీ జోన్‌లోకి వెళ్లిపోయాయి. బాన్సువా డకు చెందిన కొందరు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మొదట్లో 12 పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదైన తర్వాత జిల్లాలోని కామారెడ్డిలోని దేవునిపల్లిలో, బాన్సువాడ టీచర్స్‌ కాలనీ, బర్కత్‌పుర కాలనీలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఈ నెల 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేప థ్యంలో ప్రభుత్వం వివిధ దుకాణాలను, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలను తెరుచుకునేందుకు సడలింపును ఇచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు తెరు చుకొని కార్యక్రమాలు నిర్వహించేం దుకు అవకాశం కల్పించారు. అదే సమయాల్లో ప్రజలు బయటకు వస్తు న్నారు. అంతే కాకుండా సరి, బేసి విధా నం ప్రకారం దుకాణాలు తెరుచుకు న్నాయి.


వలస కూలీలు..

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి జిల్లాలో 635 మంది వలస కూలీల కు విద్యార్థుల పునరావాస కేం ద్రాల్లో వసతి కల్పించారు. మూడు రోజుల కిందట వీరందరిని జిల్లా యంత్రాం గం చొరవ, దాతల సహకా రంతో వాహనాల ద్వారా వారి స్వస్థలాలకు తరలించారు. దీంతో పునరావాస కేంద్రాలన్నీ ఖాళీ అయ్యాయి. తాజాగా మళ్లీ కొంత మంది కూలీలు తమను స్వస్థలాలకు చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారు. వారిని పంపించేం దుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.


ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా

జిల్లాలోకి విదేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులను జిల్లా అధికార యంత్రాంగం 568 మందిని గుర్తిం చింది. వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగ ంతో పాటు ఇళ్ల పక్కన ఉన్నవారు కూడా వారి పట్ల నిఘాను ఉంచి ప్రతీరోజు ఆరా తీస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పట్ల జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపుతోంది. 28 రోజుల పాటు హోం క్వారం టైన్‌లో ఉండేలా చర్యలు చేపట్టింది. కామారె డ్డి జిల్లా ఇక సేఫ్‌ జోన్‌లోకి వచ్చినట్లయింది. ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లోకి జిల్లాను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశా లు లేకపోలేదు.


Updated Date - 2020-05-09T11:19:19+05:30 IST