కార్మికులను మోసం చేస్తే సహించం

ABN , First Publish Date - 2020-11-27T05:08:03+05:30 IST

కార్మికులను మోసం చేస్తే సహించ మని కార్మిక, ఉద్యోగ, బ్యాంకు సంఘాల నాయకులు హెచ్చరించారు.

కార్మికులను మోసం చేస్తే సహించం
నిర్మల్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 26 : కార్మికులను మోసం చేస్తే సహించ మని కార్మిక, ఉద్యోగ, బ్యాంకు సంఘాల నాయకులు హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్‌పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రజా, కార్మికులకు వ్యతిరేకంగా తీసు కొస్తున్న జీవోలను వ్యతిరేకిస్తూ గురువారం ఆదిలాబాద్‌ జిల్లాలో సమ్మె చేపట్టారు. స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట అఖిల పక్షం, వా మపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంత రం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ముడుపు ప్రభాకర్‌రెడ్డి, దర్శనాల మల్లేష్‌, వెంకట్‌నారాయణ, అరుణ్‌కుమార్‌, బండిదత్తాత్రి, సంగెంబొర్రన్న, మునిగెల నర్సింగ్‌, రాములు, లింగాల చిన్నన్న పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ అనుబంధ ఎస్‌డబ్ల్యుఎఫ్‌ కార్మికులు నిర సన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ట్రాన్స్‌కో 1104 ఉద్యోగులు, మహారాష్ట్ర, ఎల్‌ ఐసీ, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఉద్యోగులు, కార్మికులు ఆయా కార్యాలయాల ఎదుట కేంద్రం తీసుకొస్తున్న నూతన కార్మిక వ్యతిరేక జీవోలను ఎండగ డుతూ ప్రభుత్వరంగ సంస్థలను, రైల్వేలను ప్రైవేట్‌పరం చేయొద్దని డి మాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్‌ ఆవరణలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఎన్జీవోస్‌ అధ్యక్ష కార్యదర్శులు సంద అశోక్‌, ఎ.నవీన్‌కుమార్‌ మాట్లాడా రు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీ వోస్‌ తిరుమల్‌రెడ్డి, గోపి, మోహన్‌, మహేందర్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

భైంసా రూరల్‌: మీర్జాపూర్‌ వద్ద రాస్తారోకో నాయకులు రాస్తారోకో చే శారు. రైతులను నాశనం చేసి కార్పొరేట్‌లకు వ్యవసాయ రంగాన్ని అప్పజె ప్పే చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకే ఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇప్ప లక్ష్మణ్‌, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరిత,  ముత్తన్న, సాజిద్‌ పాల్గొన్నారు. 

లక్ష్మణచాంద : అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వ ర్యంలో కనకాపూర్‌లో రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు.  కార్యక్రమం లో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ రెడ్డి, రైతు కార్మిక సంఘం జి ల్లా కార్యదర్శి దుర్గం నూతన్‌ కుమార్‌, ఎస్‌.గంగన్న పాల్గొన్నారు. 

నిర్మల్‌ కల్చరల్‌ : టీఎన్‌జీవోలు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అధ్యక్షుడు ప్రభాకర్‌, కార్యదర్శి రవికుమార్‌, ప్రవీణ్‌, సురేందర్‌, ధర్మానంద గౌడ్‌ పాల్గొన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే కోడ్‌ కేంద్రం వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్య దర్శి రాజన్న డిమాండ్‌ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నిర్మల్‌లో జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీనివాసాచారి, భీంరెడ్డి, ఎస్‌ఎన్‌ రెడ్డి, గంగన్న పాల్గొన్నారు. 

భైంసా : కార్మికలోకం పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కార్మిక సంఘాలు గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె భైంసా డివి జన్‌లో విజయవంతం అయ్యింది. ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, పీవోడ బ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. 

ఖానాపూర్‌ : రైతన్నకు న్యాయం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త క్షణమే చర్యలు చేపట్టాలని ఏఐకేఎమ్మెస్‌ ఉమ్మడి జిల్లా అఽధ్యక్షుడు నంది రామయ్య అన్నారు. సత్తన్‌పెల్లి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు.  కా ర్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్‌ మోయిద్‌, రణధీర్‌, ఎల్‌ఆర్‌ ఉపాలి, భీమన్న, నాగెల్లి నర్సయ్య, తిరుపతి, సురేష్‌ పాల్గొన్నారు. 

ఇంద్రవెల్లి: మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. 

ఉట్నూర్‌రూరల్‌ : అంబేద్కర్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధ ర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ స్కూల్‌లను మూసి వేయాలని ప్రభు త్వం కుట్ర చేస్తుందని సీఐటీయూ నాయకుడు కిరణ్‌ విమర్శించారు.

Updated Date - 2020-11-27T05:08:03+05:30 IST