నేడు మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన
ABN , First Publish Date - 2020-12-16T04:59:16+05:30 IST
రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం జిల్లాకేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 15: రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం జిల్లాకేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. కలెక్టరేట్‌లో జరిగే సలహా మండలి సమావేశంలో పాల్గొంటారు. 11.30 గంటలకు టీఎన్జీవో భవనంలో రాష్ట్ర మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డికి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగే క్రిస్‌మస్ పండుగ సందర్భంగా పే ద క్రిస్టియన్‌లకు గిఫ్ట్‌లు అందజేస్తారు.