నేడు ఓపీ బంద్‌... ఐఎంఏ ఆధ్వర్యంలో ధర్నా

ABN , First Publish Date - 2020-12-11T05:11:02+05:30 IST

జాతీయ వైద్యుల సంఘం పిలుపు మేరకు ఐఎంఏ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ జీవన్‌రావు, డాక్టర్‌ విశాల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు ఓపీ బంద్‌... ఐఎంఏ ఆధ్వర్యంలో ధర్నా


పెద్దబజార్‌, డిసెంబరు 10: జాతీయ వైద్యుల సంఘం పిలుపు మేరకు ఐఎంఏ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ జీవన్‌రావు, డాక్టర్‌ విశాల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ యుర్వేద వైద్యులు మోడ్రన్‌ ఆపరేషన్‌లు చేయడం, మందులను వాడించడా న్ని నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజామాబాద్‌లోని ఆసుపత్రులలో ఓపీ సేవలు నిలిపివేస్తున్నామని,  ప్రజలు సహకరించాలని వారు కోరారు. 

Updated Date - 2020-12-11T05:11:02+05:30 IST