నేడు నిజామాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ రాక

ABN , First Publish Date - 2020-12-02T04:31:42+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం నిజామాబాద్‌ జిల్లాకు రానున్నారు. మాక్లూర్‌లో జరగనున్న అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా తండ్రి ద్వాదశదినకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

నేడు నిజామాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ రాక
మాక్లూర్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి

అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల కుటుంబసభ్యులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి 

హాజరుకానున్న పలువురు మంత్రులు

నిజామాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం నిజామాబాద్‌ జిల్లాకు రానున్నారు. మాక్లూర్‌లో జరగనున్న అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా తండ్రి ద్వాదశదినకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన ఒంటి గంటకు మాక్లూర్‌ చేరుకుంటారు. నేరుగా బిగాల గణేష్‌గుప్తా ఇంట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మ ధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ఆయన హైదరాబాద్‌కు వెళతారు. సీఎం రాక సందర్భంగా మాక్లూర్‌లోని ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యే క ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ శివారు ఎమ్మెల్యే ఇంటి వరకు పోలీసు బం దోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం వచ్చి వెళ్లేంత వరకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్ర శాంత్‌రెడ్డి, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు ఎంపీలు, ఉమ్మడి నిజామాబాద్‌ జి ల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హా జరుకానున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు వస్తుండడంతో పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా సీఎం వచ్చి వెళ్లేంత వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం వచ్చిన సమయంలో ఇతరులు ఇంటి వద్దకు ఎక్కువగా రాకుండా గట్టి భద్రతా ఏ ర్పాట్లు చేశారు.   

అభివృద్ధి నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు

సీఎం కేసీఆర్‌ జిల్లాకు వస్తుండడంతో అధికారులు కూడా అప్రమత్తమ య్యారు. తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధి నివేదికలను సిద్ధం చేస్తున్నారు. సీఎం ప్రైవేటు కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ అవసరమైతే వి వరాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం మాక్లూర్‌ వస్తున్నందున  కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయతో పాటు అన్ని శాఖల అధికారులు హాజరవుతున్నారు. సీఎం జిల్లాకు సంబంధించిన ఏవైనా పనుల వివరాలు అడిగితే వివరించే విధంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-02T04:31:42+05:30 IST