‘ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-12-12T04:54:32+05:30 IST

అక్రమాలు వెలికితీసిన విలేకరిని చంపుతామని బెదరింపులకు పాల్పడ్డ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బంజారా జర్నలిస్టుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వసంతరావు డిమాండ్‌ చేశారు.

‘ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’

పెద్ద బజార్‌, డిసెంబరు 11: అక్రమాలు వెలికితీసిన విలేకరిని చంపుతామని బెదరింపులకు పాల్పడ్డ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బంజారా జర్నలిస్టుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వసంతరావు డిమాండ్‌ చేశారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించిన సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజలకు చేరవేసే పవిత్రవృత్తిలో విలేకరులున్నారన్నారు. అటువంటి విలేకరులను ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురి చేయడం తగదని హెచ్చరించారు. ఫోన్‌లో చంపేస్తానని ఎవరికి చెప్పుకుంటోవో చెప్పుకో అని తూలనాడటం సరికాదని, వెంటనే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపైకఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు వినయ్‌, విజయ్‌, మోహన్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-12T04:54:32+05:30 IST