బాన్సువాడలో మూడు కాలనీలు కంటోన్మెంట్ జోన్లు
ABN , First Publish Date - 2020-04-07T10:39:35+05:30 IST
పట్టణంలోని ఆర్పాత్ కాలనీ, గౌలిగూడ, ఫిర్దోస్ కాలనీలను కంటోన్మెంట్ కాలనీలుగా ప్రకటించినట్లు బాన్సువాడ ఆర్డీవో

బాన్సువాడ, ఏప్రిల్ 6 : పట్టణంలోని ఆర్పాత్ కాలనీ, గౌలిగూడ, ఫిర్దోస్ కాలనీలను కంటోన్మెంట్ కాలనీలుగా ప్రకటించినట్లు బాన్సువాడ ఆర్డీవో రా జేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా 706 ఇండ్లు టీ చర్స్ కాలనీ, శ్రీరామ కాలనీలోకి వస్తాయని, అలా గే ఆర్పాత్ కాలనీ, గౌలిగూడ, ఫిర్దోస్ కాలనీలలో 548 ఇండ్లు వస్తాయన్నారు. ఈ కాలనీకి చెందిన ప్రజలు ఇంటి బయటకు వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితి మెడికల్, ఆస్పత్రికి మాత్రం అనుమతి ఉందన్నారు.