తగ్గుముఖం
ABN , First Publish Date - 2020-04-26T09:58:47+05:30 IST
జిల్లాలో 12 మంది కరోనా భారిన పడి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి

జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్
గత 10 రోజులుగా నమోదు కాని కొత్త పాజిటివ్ కేసులు
అనుమానిత లక్షణాల కేసులు కూడా తగ్గుముఖం
12 వద్దనే ఆగిపోయిన కరోనా కేసుల సంఖ్య
ఇందులో ఇప్పటికే ఐదుగురు బాధితుల డిశ్చార్జి
తాజాగా డిశ్చార్జి అయిన మరో ఇద్దరు
ఖాళీ అయిన క్వారంటైన్‌లు, భిక్కనూరు క్వారంటైన్‌లో 15 మంది
క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న రెండు కట్టడి ప్రాంతాలు
పోలీసుల దిగ్బంధంలోనే కట్టడి ప్రాంతాలు
జిల్లాలో మరింత పకడ్బందీగా అమలవుతున్న లాక్‌డౌన్
జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి వస్తోం ది. ఒక్కసారిగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. గత 10 రోజు లుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవ డంతో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోం ది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 వర కు వచ్చి ఆగిపోయింది. ఇప్పటికే కరోనా సోకిన ఐదుగురు బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా శనివా రం మరో ఇద్దరు కరో నా నుంచి బయటప డి డిశ్చార్జి అయ్యారు. గత మూడు రోజుల నుంచి కరోనా అను మానిత లక్షణాల కేసు లు కూడా రావడం లేదని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా లోని క్వారంటైన్‌లోనూ కరోనా అనుమాని త లక్షణాలు ఉన్న వారి సంఖ్య కూడా తగ్గి పోయింది. జిల్లా లోని రెండు కట్టడి ప్రాంతా ల క్వారంటైన్ కూడా పూర్తి కావడం విశేష ం. జిల్లాలో పకడ్బందీగా అమలువుతున్న లాక్‌డౌన్ కరోనా వైరస్ విస్తరించకుండా జిల్లా యం త్రాంగం అడ్డుకట్ట వేస్తోంది. కానీ జిల్లాలో ఉన్న కట్టడి ప్రాంతాల్లో మాత్రం దిగ్బంధం కొనసాగుతోంది.
కామారెడ్డి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 12 మంది కరోనా భారిన పడి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడ గానే ఉంటూ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు కరోనా వైరస్ నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో వీరిని ఇప్పటికే గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తాజాగా శనివారం బాన్సువాడ పట్టణానికి చెందిన మరో ఇద్దరు కరోనా నుంచి కోలుకోవడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. అన గా గాంఽధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదు గురు చికిత్స పొందుతున్నారు. ఇతర దేశాలు, రాష్ర్టాలు, జిల్లాల నుంచి కామారెడ్డి జిల్లాకు వచ్చిన వారిని అధికారులు గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్, హోం క్వారంటైన్‌లో నిర్బంధించిన విషయం తెలిసిందే. వీరందరి క్వారంటైన్ సైతం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 225 మందికి పైగా రక్త నమునాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఇందులో 213 మందికి కరోనా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు. దీంతో అనుమానిత లక్షణాల కేసులు కూడా రాకపోవడంతో ల్యాబ్‌ల్లో ఎలాంటి రిపోర్ట్‌లు పెండింగ్‌లో లేవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా రులు పేర్కొంటున్నారు.
రెండు కట్టడి ప్రాంతాల్లో క్వారంటైన్ పూర్తి
జిల్లాలోని కామారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా బాన్సువాడ పట్టణంలో 11 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కామారెడ్డిలోని దేవునిపల్లి, బాన్సువాడలోని టీచర్స్ కాలనీ, అర్పత్ కాలనీ, మదీనా కాలనీలను నాలుగు కట్టడి ప్రాంతాలుగా జిల్లా యంత్రాంగం ప్రకటిం చింది. దేవునిపల్లి, మదీనా కాలనీ కట్టడి ప్రాంతాల్లో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదు కాగా ఈ కాలనీల్లోని ప్రజల క్వారంటైన్ పూర్తయింది.
అనగా ఈ రెండు కట్టడి ప్రాం తాల్లో క్వారంటైన్ పూర్తి కావడంతో ఈ జోన్ల పరిధిలోని కాలనీ ప్రజలకు కాస్త వెసు లుబాటు కల్పిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా అర్పత్ కాలనీలో ఆరు, టీచర్స్ కాలనీ లో 4 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ కట్టడి ప్రాంతాల్లో క్వారంటైన్ మరో ఐదు రోజుల్లో పూర్తి కానుందని అధికారులు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కట్టడి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కాస్త ఊరటనిస్తోంది. అదే విధంగా జిల్లాలోని బాన్సువాడలో గల బోర్లం, ఎల్లారెడ్డిలో గల ప్రభుత్వ క్వారంటైన్‌లు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఈ రెండు క్వారంటైన్‌లో ఉన్న వారి రిపోర్టులు సైతం నెగిటివ్ రావడంతో అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు. అదే విధంగా కామారెడ్డిలోని భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో గల ప్రభుత్వ క్వారంటైన్‌లో 15 మంది ఉన్నారు. కట్టడి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కానప్పటికీ పోలీసుల దిగ్బంధంలోనే ఈ జోన్లు కొనసాగుతున్నాయి. మే 7 వరకు ఈ జోన్లలో నూటికి నూరుశాతం లాక్‌డౌన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
లాక్‌డౌన్ మరింత కఠినంగా..
జిల్లాలో కరోనాను పూర్తిగా నిర్మూలించేందుకు యంత్రాంగం లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మే7 వరకు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేం దుకు అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డిల పర్యవేక్షణలో పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం తో కరోనాను కట్డడి చేస్తున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్ నెల రోజు లు పూర్తి చేసు కున్నప్పటికీ ప్రజలను బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. అన వసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని అదుపులోకి తీసుకొ ని వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 6 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు.
అదే విధంగా మాస్క్‌లు ధరించకుం డా, రద్దీగల ప్రాంతంలో భౌతిక దూరం పాటించకు ండా ఉంటున్న వారికి జరి మానాలు విధిస్తున్నారు. ప్రజలకు నిత్యావసర సరుకుల సమస్య తలెత్తకుండా ఖాళీ ప్రదేశాల్లో ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకుల విక్రయాలు జరిగే కిరాణా దుకా ణాలకు, సూపర్ మార్కెట్లకు, మెడికల్ షాపులకు ఉద యం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అనుమతి ఇస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించే వారిపై పోలీస్, రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో జిల్లాలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది.