కుర్నాపల్లి ఉమామహేశ్వరాలయంలో చోరీ

ABN , First Publish Date - 2020-12-14T05:14:25+05:30 IST

ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఉమా మహేశ్వర ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఆలయంలో చొరబడి ధ్వంసం చేశారు.

కుర్నాపల్లి ఉమామహేశ్వరాలయంలో చోరీ

ఎడపల్లి, డిసెంబరు 13 : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఉమా మహేశ్వర ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఆలయంలో చొరబడి ధ్వంసం చేశారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి ఆలయ పూజారి ఆదివారం ఉదయం గుడి తెరువగానే అక్కడ చిందర వందరగా తాళం పగలగొట్టి దుండగులు హుండీని బయటకు తీసుకెళ్లి నగదును తీసుకొని హుండీని పక్కనే ఉన్న చెరువులో పడేశారు. ఈ మేరకు సర్పంచ్‌ సావిత్రి, ఆలయ కమిటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డికు తెలియజేశారు. ఘటన స్థలానికి  ఎస్సై ఎల్లగౌడ్‌, పోలీసు సిబ్బంది పోలీసులు చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

Updated Date - 2020-12-14T05:14:25+05:30 IST