తాడ్వాయిలో చోరీ
ABN , First Publish Date - 2020-12-16T05:17:48+05:30 IST
మండల కేంద్రంలో గైని రా జయ్యకు చెందిన ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగి నట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. తాడ్వాయికి చెందిన రాజయ్య తొమ్మిదినెలల నుంచి కామారెడ్డిలోని అశోక్‌నగర్ లో నివాసం ఉంటున్నారు.

తాడ్వాయి, డిసెంబరు 15: మండల కేంద్రంలో గైని రా జయ్యకు చెందిన ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగి నట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. తాడ్వాయికి చెందిన రాజయ్య తొమ్మిదినెలల నుంచి కామారెడ్డిలోని అశోక్‌నగర్ లో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు తాడ్వాయి గ్రా మంలోని తన ఇంటికి వస్తూ వెళ్తుంటారు. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి సాయంత్రం 6 గంటలకు తిరి గి వెళ్లిపోగా రాత్రి సమయంలో ఇంటికి వేసిన తాళాన్ని ప గలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో ఉన్న రూ.20 వేల నగదు, తులం బంగారం ఎత్తుకెళ్లినట్లు వివరించారు. మంగళవారం ఇంటికి వేసిన తాళం పగలగొట్టిన విషయాన్ని గుర్తించిన స్థానికులు రాజయ్యకు ఫోన్‌చేసి సమాచారం అందించారని తెలిపారు. ఈ విషయమై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకట్ పరిశీలించారు.