సాగర్‌ ఆయకట్టుకు రెండో విడత నీటి విడుదల

ABN , First Publish Date - 2020-03-19T11:23:02+05:30 IST

ఉభయ జిల్లాల నిజాంసాగర్‌ ఆయకట్టుకు రెండోవిడత నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాల్వ ద్వారా 1200

సాగర్‌ ఆయకట్టుకు రెండో విడత నీటి విడుదల

నిజాంసాగర్‌, మార్చి 18: ఉభయ జిల్లాల నిజాంసాగర్‌ ఆయకట్టుకు రెండోవిడత నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాల్వ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 1405 అడుగులకు గాను, 1382.16అడుగుల నీటి సామర్థ్యం కలిగి 1.772 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండోవిడత నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వారం రోజుల పాటు డిస్ట్రీబ్యూటర్‌ 1నుంచి 38వరకు 89వేల ఎకరాల లో వేసిన వరి పైరుకు ఈ నీటిని విడుదల చేసినట్లు డిప్యూటీ ఈఈ దత్తాత్రేయ తెలిపారు.


నిజాంసాగర్‌ నుంచి విడుదల చేస్తున్న నీటిని జల విద్యుత్తు కేంద్రం ద్వారా విడుదల చే స్తున్న నేపథ్యంలో రెండో టర్భయిన్‌లో 3.9 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి జరుగుతుందని జన్‌కో డీఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉత్ప త్తి అయిన విద్యుత్తును మెయిన్‌ లైన్‌ గ్రిడ్‌కు పంపిస్తారని తెలిపారు.


ప్రధాన కాల్వలో 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో కాల్వలో నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుందని నీటిలోకి రైతులు, ప్రజలు వెళ్లవద్దని ఆయన తెలిపారు. ప్రధాన కాల్వ వెంట విడుదల చేసే నీటిని రైతులు పొదుపుగా వాడు కోవాలని ఆయన సూచించారు. మొదటి విడత నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఫిబ్రవరి 20వతేదీ నుంచి మార్చి 2వతేదీ వర కు 1.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారని తెలిపారు.

Updated Date - 2020-03-19T11:23:02+05:30 IST