భక్తుల కొంగుబంగారం.. భీమ్‌గల్‌ లక్ష్మీనర్సింహుడు

ABN , First Publish Date - 2020-11-28T04:47:53+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం లింబాద్రి గుట్టపై కార్తీకమాసం సందర్భంగా ల క్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ప చ్చనిచెట్లు, కొండల మధ్య లింబాద్రిగుట్టపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి భక్తుల కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీ ర్చే ఇలవెల్పుగా ప్రసిద్ధి చెందారు.

భక్తుల కొంగుబంగారం.. భీమ్‌గల్‌ లక్ష్మీనర్సింహుడు
లక్ష్మీనర్సింహస్వామి మూల విరాట్‌

రేపు లింబాద్రిగుట్ట జాతర.. ఏర్పాట్లు పూర్తి

కొవిడ్‌ నిబంధనలతో రథోత్సవం

భీమ్‌గల్‌, నవంబరు 27: నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం లింబాద్రి గుట్టపై కార్తీకమాసం సందర్భంగా ల క్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ప చ్చనిచెట్లు, కొండల మధ్య లింబాద్రిగుట్టపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి భక్తుల కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీ ర్చే ఇలవెల్పుగా ప్రసిద్ధి చెందారు. ప్రతీఏటా కార్తీకమాసం శుద్ధపంచమి ఉపరిషష్ఠి మొదలుకొని బహుళ విదియ వర కు 12రోజుల పాటు కొండపై బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా రు. స్థలపురాణం ప్రకారం గుట్టపై స్వామివారు ఒక గుహ లో వెలియగా స్వామివారితో పాటు దక్షిణాబద్రిలో ఉన్న న రనారాయణులు సైతం ఇక్కడనే వెలిశారని ఆలయ ధర్మ కర్త తెలిపారు. కొండపై మాఢవీధులు, పుష్కరిణి, కల్యాణ మండపం, రథం, ఆంజనేయస్వామి, ద్వారపాలకులు, జో డు లింగాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ నర్సింహుడి స్వయంభూ క్షే త్రాల్లో ఇదొకటి. బ్రహ్మదేవుడు పార్వతీపరమేశ్వరుల కల్యా ణ సమయంలో పార్వతి పాదాలను చూడడంతో కోపోద్రిక్తు డైన శివుడు తన గోటితో బ్రహ్మ ఐదో తలను తొలగించాడ ని స్థలపురాణంలో ఉంది. దీంతో బ్రహ్మ ఇక్కడే తపస్సు చే స్తూ శ్రీవారిని నరసింహుడిగా సాక్షాత్కరించాడని పురాణం లో ఉంది. అప్పటి నుంచి లక్ష్మీసమేతుడుగా స్వామివారు ఇ క్కడే వెలిశారని ఆలయధర్మకర్త లింబాద్రి తెలిపారు. నర నారాయణులు కూడా ఇక్కడే వెలియడంతో ఈ కొండకు దక్షిణ బద్రిగా కూడా పేరు వచ్చింది. శ్రీరాముని ఆజ్ఞతో హ నుమంతుడు ఇక్కడే తపమాచరించి నరసింహుడి రూపం లో ఉన్న శ్రీరామున్ని దర్శించుకోవడంతో ఇక్కడ ఉన్న పు ష్కరిణి (కోనేరు)కి కమల పుష్కరిణి అనే పేరు వచ్చింది. సతీ విక్రయదోష నివారణకే సత్యహరిశ్చంద్రుడు నరసిం హుని సేవించి తరలించాడట. నరనారాయణుల సన్నిదాన ంతో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నా రట. ధర్మరాజు ఈ క్షేత్రాన్ని దర్శించి కృతార్హుడైనట్టు.. ప్రహ్లా దుడు తపమాచరించినట్టు.. స్థల పురాణాలలో పేర్కొనబ డిందని తెలిపారు. ఇక్కడ ఎక్కువగా వేపచెట్టు నిండుగా ఉండడంతో ఈ కొండకు నింబాచలము అనే పేరు వచ్చిం ది. లింబాద్రిగుట్టపై స్వామివారి మహాత్మ్యంతో గతంలో క న్నా భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు సేవభావం తో భక్తులు వస్తున్నారు.

రేపు జాతర

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్స వం, జాతర నిర్వహిస్తున్నామని ఆలయధర్మకర్త నంబి లిం బాద్రి తెలిపారు. ఈ జాతరకు వచ్చే భక్తులు తప్పని సరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.  

ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలు

లింబాద్రిగుట్టపైకి వస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేయాలని నిర్ణ యంతో ఐదేళ్ల క్రితం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతీ శనివారం భక్తులందరికీ భోజన వసతి కల్పిస్తు న్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది నుంచి శనివారం తో పాటు ఆదివారం భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. గోసం రక్షణ సేవా కేంద్రం ఏర్పాటు చేసి సుమారు 60 ఆవులకు కొండపైన ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. భక్తుల విరా ళాలతో అన్నదాన సత్రాన్ని, గోసంరక్షణ కేంద్రాన్ని నిర్వహి స్తున్నారు. గుట్ట కింద కొన్ని గదుల్ని కూడా నిర్మించారు. 

Read more