అధికార పార్టీ నేతలు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు
ABN , First Publish Date - 2020-05-24T11:18:55+05:30 IST
ఉమ్మడి జిల్లా పరిధిలో ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ

పార్టీ మారిన సభ్యులపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
నిజామాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పరిధిలో ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీల సభ్యులను పార్టీ లో చేర్చుకుంటున్నారని, వారిపై తగిన చర్యలను తీసుకోవాలని కోరారు. ఉప ఎన్నికల నామినేషన్‌లు పూర్తయి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న స మయంలో మంత్రి, విప్, జహీరాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ, జ డ్పీటీసీలను, కౌన్సిలర్‌లను, కార్పొరేటర్‌లను పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు.
ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం ఫిరాయింపుల మీద దృష్టి పెట్టారన్నారు. పార్టీ మారినా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్‌లు, కార్పొరేటర్‌లను ఉప ఎన్నికల్లో ఓటువేయకుండా అనర్హులుగా ప్రకటించాలని రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉభయ జిల్లాల అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, కైలాస్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి సు భాష్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఇన్‌ఛార్జి తాహెర్ బిన్ హుందాన్, నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి ఉన్నారు.