కొనుగోలు కేంద్రం నీటిమయం

ABN , First Publish Date - 2020-03-16T10:25:52+05:30 IST

మండలంలోని కందకుర్తి శనగ కొనుగోలు కేంద్రం శుక్ర వారం కురిసిన వర్షానికి శనగ తడిసి ముద్దకాగా కొనుగోలు కేంద్రం నీటిమయమైంది. రెండు రోజుల నుంచి శనగ కొనుగోలును నిలిపివేశారు.

కొనుగోలు కేంద్రం నీటిమయం

రెంజల్‌, మార్చి 15: మండలంలోని కందకుర్తి శనగ కొనుగోలు కేంద్రం శుక్ర వారం కురిసిన వర్షానికి శనగ తడిసి ముద్దకాగా కొనుగోలు కేంద్రం నీటిమయమైంది. రెండు రోజుల నుంచి శనగ కొనుగోలును నిలిపివేశారు. ఆదివారం మోటారు సాయంతో నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. సుమారు 5వేల బస్తాలకు పైగా శనగ వర్షంలో తడిసి ముద్దయ్యాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షం రైతన్న లకు అపార నష్టం తీసుకొచ్చింది. 

Updated Date - 2020-03-16T10:25:52+05:30 IST