అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-30T04:50:39+05:30 IST

ఆర్మూర్‌ పట్టణ ఆర్‌టీసీ డిపో అద్దె బస్సు డ్రైవర్‌ల స మస్యలు పరిష్కరించాలని మంగళవారం ఉదయం 5గంటల నుంచి సమ్మె నిర్వ హించారు.

అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

పెర్కిట్‌, డిసెంబరు29: ఆర్మూర్‌ పట్టణ ఆర్‌టీసీ డిపో అద్దె బస్సు డ్రైవర్‌ల స మస్యలు పరిష్కరించాలని మంగళవారం ఉదయం 5గంటల నుంచి సమ్మె నిర్వ హించారు. అద్దె బస్సు డ్రైవర్‌ అగ్రిమెంట్‌ పూర్తయి ఆరు నెలలు గడిచినా యాజమాన్యం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని అద్దె బస్సుల డ్రైవర్ల యునియన్‌ అధ్యక్షుడు అశోక్‌ అన్నారు. ఏ విధమైన అనుభవం లేని డ్రైవర్‌లతో బస్సులు నడుపుతున్నారని. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించడంలేద అన్నారు. వెంటనే అధికారులు యజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరిం చాలని తెలిపారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు వెంకటేష్‌, సీఐటీయు నాయకుడు కోదడ ఎల్లయ్య, రైతు సంఘం నాయకులు భూమన్న, అద్దె బస్సు డ్రైవర్లు శ్రీను, ప్రభాకర్‌, ఎండి.షకీల్‌, రవికాంత్‌, డ్రైవర్లు సమ్మెలో ఉన్నారు.


Updated Date - 2020-12-30T04:50:39+05:30 IST