పేరుకే పెద్దాసుపత్రి
ABN , First Publish Date - 2020-03-02T12:54:17+05:30 IST
కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి.. పేరుకే పెద్దాసుపత్రి. జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడైనా ఇంకా ఏరి యా ఆసుపత్రి మాదిరే సేవలు అందుతు న్నాయి

- జిల్లా కేంద్ర ఆసుపత్రిగా అప్‌గ్రేడైనా పెరగని పడకల సంఖ్య
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- సిటీస్కాన్ సౌకర్యం లేక రోగులకు ఇక్కట్లు
కామారెడ్డిటౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి.. పేరుకే పెద్దాసుపత్రి. జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడైనా ఇంకా ఏరి యా ఆసుపత్రి మాదిరే సేవలు అందుతు న్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 250-350 బెడ్‌లతో సేవలు అందాల్సి ఉండగా.. 100 పడకలతోనే కొనసాగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్నీ చికిత్సలు అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. దానికి తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేయడంలో, నిధులను కేటాయించడంలో మీనమేషాలు లె క్కిస్తోంది. దీంతో జిల్లా ప్రజలకు అందాల్సిన వైద్యం ఎండమావిగానే మారింది. కేసీఆర్ కిట్, అమ్మఒడి పఽథకాలతో ఆసుపత్రికి గర్భి ణుల తాకిడి విపరితంగా పెరిగింది. నిత్యం వివిధ మండలాల నుంచి ఆసుపత్రికి రోగు లు వస్తారు. దీంతో ఒక్కో వ్యక్తి గంటల తర బడి క్యూలైన్‌లో వెచి చూడాల్సిన పరిస్థితి. పరిసరాలు కార్పొరేట్ ఆస్పత్రి స్థాయిలో ఏ ర్పాటు చేసినా.. పేదలకు మాత్రం చికిత్సలు అందని ద్రాక్షనే!
వైద్యుల సంఖ్య పెరిగినా..
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కింది స్థాయి సిబ్బంది కొరత మాత్రం వేధిస్తోంది. ఇటివల పలువురు వైద్యులను నియమించినప్పటికీ వారికి సహయం అందించేందుకు ఏరియా ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది కింది స్థాయి సిబ్బంది ఉన్నారో ఇప్పుడు అంతేమం ది సిబ్బంది ఉన్నారు. జిల్లాలోని పలు పిహెచ్‌సీలలో ప్రసవాలు చేయకపోవడం, గర్భి ణులు జిల్లా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి అంతా కిక్కిరిసిపోతోంది. వైద్యులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన నర్సుల సంఖ్య త క్కువగా ఉండడంతో శానిటేషన్ పనుల ని మిత్తం నియమించిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారు. నిత్యం ఆసుపత్రిని శుభ్రంగా ఉంచడంతోపాటు అద నంగా ఆయా వార్డుల్లో వారి సేవలను విని యోగించికోవడంతో తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు.
రోగులకు సౌకర్యాల లేమి..
ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒంట్లో బాగాలేదని ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రసవం కోసం వచ్చిన మహిళలకు ప్రస వ వేదన తప్పడం లే దు. జ్వరం వచ్చిందని వచ్చిన రోగులకు నిలబడలేక కాల నొప్పులు వస్తున్నాయి. కేసీఆర్ కిట్, అమ్మఒడి నజారానా వల్ల ఆసుపత్రికి గర్భిణులు క్యూ కడుతు న్నారు. ఓపీ గది నుంచి ఆసుపత్రి ప్రవేశ ద్వారం వరకు ఎండలో సైతం నిలబడాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం దాదాపు వెయి మంది వరకు ఓపీ పేషంట్లు వస్తారు. చిన్నపిల్లలు,దంతాలు, కంటి, పిజీషియన్ డాక్టర్ల ఓపి రూములు ఓకే వైపు ఉండడం, ఇన్‌పేషంట్ల బంధువులు రాకపోకలతో ఆసుపత్రి మొత్తం నిండిపోతుంది. డాక్టర్‌ను కలవడానికే దాదా పు రెండు గంటల వరకు నిరిక్షించాల్సి రావడంతో ప్రజలు ఆసుపత్రికి వచ్చెందుకు భ యపడుతున్నారు. వాస్తవానికి ఆసుపత్రి స్థాయి 100 పడకలే అయినా 180 వరకు ప డకలు అవసరం ఉంది. ఆసుపత్రి స్థలం త క్కువగా ఉండడంతో గత రెండు సంవత్స రాల క్రితం వైద్యఆరోగ్యశాఖ మంత్రి 100 పడకల ఎంసీహెచ్‌ను నిర్మించడానికి ప్ర భుత్వ డిగ్రి కళాశా ల ప్రాంతంలో శంకుస్థాపన చేసినప్పటికీ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.
ఆసుపత్రిలో మందుల కొరత
ఆసుపత్రికి రోగికి చికిత్స అనంతరం అం దజేసే మందులు డిమాండ్‌కు తగ్గ సరా ఫరా లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు పడుతున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పా టు రెండు ఏరియా ఆసుపత్రి, రెండు క మ్యూనిటీ హెల్త్ సెంటర్‌లున్నాయి. కానీ రో గులకు కావలసిన మందులను అందించడం లో మాత్రం ప్రభుత్వం విఫలమవుతుంది. జి ల్లా ఆసుపత్రికి ప్రభుత్వం ప్రతి మూడు నె లలకొక్కసారి రోగులకు మందులు అందించ డానికి కేటాయిస్తున్న నిధులు, మందులు నెల రోజులకు కూడా సరిపోవడం లేదు. దిం తో జిల్లాలోని ఇతర ఆసుపత్రుల నిదులను వాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగి పొవ డం, శస్త్ర చికిత్సలు జరగడం ఆర్థోపిడిక్‌లో 2 నుంచి 3 శస్త్ర చికిత్సలు జరగడంతో రోగుల కు అందించే మందులు సరిపోవడం లేదు. బీపీ ట్యాబ్లెట్లు, గుండె సంబంధిత మందు లు, కంటి సమస్యలకు సంబంధించిన మం దులు, దగ్గుదమ్ము వాటికి వాడే మందులు సంవత్సరం నుంచి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ దుకాణాలను ఆశ్ర యించి మందులను కోనుగోలు చేస్తున్నారు.
జిల్లా కేంద్ర ఆసుపత్రి కావడం, హైవేకు దగ్గరగా ఉండడం నిత్యం ఏదో ఒక్క చోట ప్రమాదం జరిగి క్షతగాత్రులు చికిత్స నిమి త్తం ఆసుపత్రికి వస్తుండడంతో సరిపడా బె డ్లు లేక సేవలు అంతంత మాత్రంగానే అం దుతున్నాయి. ఇక డయాలసీస్‌లో 5 పడక లు మాత్రమే ఉండగా డయాలసిస్ చేసు కునేవారు రోజుల తరబడి వేచి ఉండాల్సి రా వడంతో హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఐసీ యూలో సైతం కేవలం 10 పడకలు మాత్ర మే ఉండగా అత్యవసర సేవల కోసం ఆసు పత్రికి వచ్చె వారికి సరైన సేవలు అందడం లేదు. పిల్లలు అనారోగ్యభారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే నానా అవస్థలు పడాలి. సరిప డా బెడ్లు లేకపోవడంతో జనరల్ వార్డులో వారికి బెడ్లను కేటాయించడం చేస్తున్నారు. దింతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు చే యించుకుంటున్నారు. ఏ విభాగంలో ఖాళీగా పడకలు ఉంటే అందులో సేవలు అందించా ల్సిన పరిస్థితులున్నాయి.
అదనపు పడకలు,
సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేస్తే మేలు..
ఆసుపత్రికి గత కలెక్టర్, ప్రభుత్వవిప్ కృషితో మరో 80 పడకలను ఏర్పాటు చేశా రు. కానీ తప్ప అందుకు తగ్గట్టుగా సిబ్బం దిని కేటాయించలేదు. పోని ఈ 80 పడక లైనా ప్రజలకు ఇబ్బందులు తొలగిస్తున్నాయ అంటే అదీ లేదు. బాలింతల వైద్యుల పర్యవే క్షణకు, డయాలసీస్ చేసుకునేవారికి, ఐసీ యూలో అత్యవసర సేవలు అందించేందుకు కావాల్సిన పడకలతోపాటు ఆయా విభాగాలో పడకల సంఖ్య పెంచడమే కాకుండా సిటీ స్కాన్ మీషన్‌ను ఏర్పాటు చేస్తే మెరుగైన సేవలు అందించవచ్చు.