ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ నీటిని అందించాలి

ABN , First Publish Date - 2020-03-12T11:47:33+05:30 IST

ప్రతీ ఇంటికి మి షన్‌ భగీరథ తాగునీటిని అందించాలని కా మారెడ్డి కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌

ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ నీటిని అందించాలి

మిషన్‌ భగీరథపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం 

పనులను త్వరగా పూర్తి చేసి నీటిని అందించాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


కామారెడ్డి, మార్చి 11 : ప్రతీ ఇంటికి మి షన్‌ భగీరథ తాగునీటిని అందించాలని కా మారెడ్డి కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో మిషన్‌ భగీరథపై అధికా రులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మిషన్‌ భగీరథ పైపులైన్ల రీస్టోరేషన్‌ పనులు, ఒహెచ్‌ఎస్‌ఆర్‌ పనులు, ఇంటింటికీ నల్లా, పెడస్టల్‌ పనులను మార్చి 25 నాటికి ధపాల వారీగా పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌ పీ-బాల్కొండ సెగ్మెంట్‌లో కామారెడ్డి నియోజ కవర్గంలో భిక్కనూరు, బీబీ పేట్‌, దోమకొండ, రాజాంపేట్‌, కామారెడ్డి, మాచారెడ్డి, రామా రెడ్డి మండలాల్లోని 187 హబిటేషన్‌లలో 100 శాతం హోజ్‌హోల్డ్‌ కనెక్షన్లకు ఏడు హబిటే షన్లలో పెండింగ్‌ ఉన్న వాటిని 15 రోజుల్లో పు నివేదిక ద్వారా సమర్పించాలన్నారు.


కామారెడ్డి నియోజకవర్గంలో 365 ఒహెచ్‌ఎస్‌ ఆర్‌ల పనులు పూర్తైనందునా బల్క్‌ వాటర్‌ సప్లై సరఫరా, టెస్టింగ్‌, ఆపరేషనల్‌ పనుల పై నివేదిక సమర్పించాలన్నారు. ఎల్లారెడ్డి ని యోజకవర్గంలోని గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, ఎల్లారెడ్డిలో 133 హబిటేషన్‌లలో 132 హిటేషన్‌లో వందశాతం హౌజ్‌ హోల్డ్‌ కనెక్షన్‌ పూర్తయ్యాయన్నారు. 239 ఒహెచ్‌ఎస్‌ ఆర్‌లలో 327 ఒహెచ్‌ఎస్‌ఆర్‌లకు బల్క్‌ వాట ర్‌ సరఫరా అయినందున మిగతా రెండు ఒ హెచ్‌ఎస్‌ఆర్‌ల పనులు వేగవంతం చేయా లన్నారు.


ఎస్‌ఆర్‌ఎస్పీ బాల్కొండ సెగ్మెట్‌ 879 హబిటేషన్లలో 137 హబిటేషన్‌లలో స్టెబి లైజేషన్‌ మార్చి 31నాటికి పూర్తి కావాలన్నా రు. సింగూరు-జుక్కల్‌ సెగ్మెంట్‌ ద్వారా బా న్సువాడ డివిజన్‌లోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, నిజాంసాగర్‌ మండలాల్లోని 138 హబిటేషన్లలో 108 హబిటేషన్లు మాత్ర మే 100శాతం హౌజ్‌హోల్డ్‌ కెనెక్షన్‌ పూర్తికాగా 30 హబిటేషన్లలో చర్యలు తీసుకోవాలన్నారు.  జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద, జుక్క ల్‌, మద్నూర్‌, పెద్దకోడప్‌గల్‌, పిట్లంలోని 209 హబిటేషన్లలో 196 హబిటేషన్లలో 100శాతం హౌజ్‌హోల్డ్‌ కనెక్షన్‌ పూర్తయ్యాయని, 13 హ బిటేషన్లు పూర్తి చేయాలన్నారు. 351 ఓహెచ్‌ ఎస్‌ఆర్‌లకు 351 పూర్తి చేశామన్నారు.


ఎల్లారె డ్డి నియోజకవర్గంలోని లింగంపేట్‌, నాగిరెడ్డి పేట, ఎల్లారెడ్డి మండలాల్లో 209 హబిటేషన ్లలో 202 హబిటేషన్లకు 100శాతం హౌజ్‌హో ల్డ్‌ కనెక్షన్లు పూర్తయి ఏడు హబిటేషన్లలో చ ర్యలు తీసుకోవాలన్నారు. 267 ఒహెచ్‌ఎస్‌ఆర్‌ లలో 266 ఒహెచ్‌ఎస్‌ఆర్‌లకు బల్క్‌ వాటర్‌ సప్లై పూర్తయి ఒక ఒహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణాని కి చర్యలు తీసుకోవాలన్నారు. సింగూరు-జు క్కల్‌ సెగ్మెంట్‌లో 556 హబిటేషన్లలో 70 హ బిటేషన్లను స్టెబిలైజ్‌ చేయాలన్నారు. జిల్లా లోని 22 మండలాల్లోని 526 గ్రామ పంచా యతీలలో మిషన్‌ భగీరథ ఇంట్రావిలేజ్‌, పైపులైన్‌ రీస్టోరేషన్‌, హౌజ్‌హోల్డ్‌ కనెక్షన్‌, త దితర పనుల పూర్తిపై గ్రామ సర్పంచ్‌, పం చాయతీ సెక్రటరీ, వార్డు మెంబర్‌, వీవో, ఏఇ (ఇంట్రాగ్రిడ్‌)లు సర్టిపై చేయాలన్నారు.


టీఎస్‌ ఈడబ్ల్యుఐడీసీ పనులు పూర్తి చేయాలి

సాంఘీక సంక్షేమ వసతి గృహాలలో టీఎస్‌ ఈడబ్లుఐడీసీ పనులు మార్చి 15లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టర్‌ చాంబర్‌లో సాంఘీ సంక్షేమ అధికారులతో క లెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 26 సాంఘీక సంక్షేమ వసతి గృహాలలో టీఎస్‌ఇడబ్ల్యుఐడీసీ ద్వారా ఆగస్టు -2019లో మంజూరైన పనుల ను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఈ లక్ష్మీనారాయణ, డీఎస్‌ డీవో శ్రీనివాస్‌బాబు, డీఈ టిస్‌ఇడబ్ల్యు ఐడీసీ రమేష్‌ పాల్గొన్నారు.


రామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలోని విద్యా ర్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్నా భోజనం అందించాలని, ఉన్నత లక్ష్యం వైపు నడిచేలా  తీర్చిదిద్ధాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధ వారం మండల కేంద్రంలోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్న లు వేశారు. అలాగే ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని నర్సరీలోని మొక్కలను పరిశీ లించి మొక్కలు ఎండిన చోట నాటాలని సి బ్బందికి సూచించారు. అనంతరం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సరియైన వైద్యం అందిస్తున్నారా? అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసు పత్రి వర్షాలకు ఊరుస్తుందని తెలుపగా.. రూ ఫ్‌ వేయించాలని, నిధులు కేటాయిస్తానని తె లిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ బా బా షర్ఫోద్దీన్‌, ఎంపీవో సవిత, గ్రామ సర్పం చ్‌ సంజీవ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ పడిగెల శ్రీనివా స్‌, ఏఎస్సై అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T11:47:33+05:30 IST