కదిలిన యంత్రాంగం
ABN , First Publish Date - 2020-04-28T06:00:52+05:30 IST
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులు ఎ దుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస క

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి
కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి, కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులు ఎ దుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస క థనాలు ప్రచురితం కావడంతో సోమవారం జిల్లా యంత్రాంగం స్పందించింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ ఇతర అధికారులు రం గంలోకి దిగారు. ఽధాన్యం కొనుగోలు చేస్తున్న సొసైటీల ను పరిశీలించారు. తరుగు తీయొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ధాన్యం ఎక్కువగా కల్లాల వద్ద ఉండడం తో త్వరగా సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్‌లను సమకూర్చడంతో పాటు హమాలీలు, వాహనాలను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైస్‌మిల్లుల వద్ద కూడా త్వరగా ధాన్యాన్ని దించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్ మండలం మోతెలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొను గోళ్లను పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, ధాన్యం తరలింపునకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మా ట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నా రాయణరెడ్డి మోపాల్, డిచ్‌పల్లి మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మా ట్లాడారు. లాక్‌డౌన్ సందర్భంగా రైతులు తమ సమ స్యలను వివరించగా ధాన్యాన్ని కొనుగోలులో ఇబ్బందు లు రావని వారికి వివరించారు. ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గన్నీబ్యాగులు, టార్పాలిన్‌లు, హమాలీల కొరతలేకుండా చూస్తామని రైతులకు తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మో తెతో పాటు ఇతర కొనుగోలు కేంద్రాలను పరిశీలంచా రు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల ని కోరారు. ఇతర మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో అధికారులు పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం, ఇత ర జిల్లాల్లో అకాల వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నవీపేట సొసైటీ పరిధిలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. తమ ధా న్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. కొనుగో లు కేంద్రాలను పెంచి, అన్నీ సమకూర్చితే రైతులకు ఇబ్బందులు లేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.