కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-28T04:24:23+05:30 IST
: మండలంలోని బీబీపూర్ తండా వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని కారు ఢీకొ నడంతో బానోత్ విఠల్ (35) అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ కుమార్ తెలిపారు.

డిచ్‌పల్లి, డిసెంబరు 27: మండలంలోని బీబీపూర్ తండా వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని కారు ఢీకొ నడంతో బానోత్ విఠల్ (35) అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ కుమార్ తెలిపారు. విఠల్ మండలంలోని జీకే తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.