మిల్లర్ల మాయాజాలం

ABN , First Publish Date - 2020-08-01T11:28:38+05:30 IST

యాసంగి పంట విక్రయించడం పూర్తి కాగా, డబ్బులు రైతుల ఖాతాలలో జమ అయ్యాయి

మిల్లర్ల మాయాజాలం

ధాన్యంలో ఇష్టానుసారంగా తరుగు

ఒప్పందం కంటే ఎక్కువ కోత 

జిల్లాలో రూ.10కోట్ల పైనే తక్కువగా చెల్లింపులు 

ఆందోళనలో అన్నదాతలు


‘‘మెండోరకు చెందిన మిట్టపల్లి రాజేశ్వర్‌ అనే రైతు 118 బస్తాల ధాన్యంను సావెల్‌ సొసైటీలో విక్రయించాడు. ఒక బస్తా 40 కిలోల చొప్పున తూకం వేసినప్పటికీ రైస్‌మిల్‌ యజమాని తరుగు కోసం పేచీ పెట్టడంతో క్వింటాకు ఐదు కిలోలకు అంగీకరించాడు. మొత్తం 44.84 క్వింటాళ్లకు రూ.82,281 రైతుకు రావాల్సి ఉంది. కానీ ఆయన ఖాతాలో రూ.74,868 మాత్రమే జమయ్యాయి. రైతుకు రూ.7,413 తక్కువగా వచ్చాయి. ఎందుకు తక్కు వగా వచ్చాయంటే సమాధానం చెప్పేవారు లేరు. అలాగే మిట్టపల్లి వెంకట్‌రెడ్డి అనే రైతు 216 బస్తాల ధాన్యాన్ని విక్రయించాడు.


ముందుగానే క్వింటాకు ఐదు కిలోలు తరుగు తీయగా, 84.40 క్వింటాళ్లకు రూ.లక్షా 58  వేల 544 రావాల్సి ఉంది. కానీ ఆయన ఖాతాలో రూ. లక్షా 52 వేల 672 మాత్రమే జమ అయ్యాయి. ఇతనికి రూ.5,872 తక్కువ వచ్చాయి. అలాగే, మిట్టపల్లి రాజవ్వ 200 బస్తాల ధాన్యం విక్రయించగా తరుగు పోను రూ. లక్షా 46 వేల 800 రావాల్సి ఉండగా రూ. లక్షా 41 వేల 662 మాత్రమే జమ అయ్యాయి. ఈమెకు రూ.5,138 తక్కువగా వచ్చాయి.’’ ఈ ముగ్గురు రైతులకే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులకు ఇలాగే డబ్బులు తక్కువగా వచ్చాయి. 


ఆర్మూర్‌, జూలై 31: యాసంగి పంట విక్రయించడం పూర్తి కాగా, డబ్బులు రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. కానీ, రైతులు లెక్కలు వేసుకుంటే విక్రయించిన ధాన్యం ఖరీదులో వ్యత్యాసం కనిపించింది. డ బ్బులు తక్కువగా వచ్చాయి. ఎందుకు ఇలా తక్కువగా వ చ్చాయని ఆరా తీస్తే రైస్‌మిల్లర్లు ఇస్టానుసారంగా రైతులకు తెలియకుండా తరుగు తీసినట్టు వెళ్లడైంది. వాస్తవానికి యాసంగిలో వరి పంట దెబ్బతిన్నది. తర్ర ఎక్కువగా ఉండ డంతో రైతులు ఐదు కిలోలు తరుగు ఇవ్వడానికి అనధికా రికంగా అంగీకరించారు. తరుగు తీయడం నిబంధనలకు వి రుద్ధమైనప్పటికీ రైతులే ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ప్రభుత్వం, అధికారులు తరుగు తీస్తే చర్యలు తీ సుకుంటామని హెచ్చరికలు చేసినప్పటికీ సంచికి రెండు కిలోలు అదనంగా తూ కం వేశారు. సంచికి రెండు కిలోలు అంటే క్వింటాకు ఐదు కిలోలు సంచి బరువుతో కలిపి తీసేశా రు.


క్వింటాకు ఐదు కిలోలు తరుగు తీసినప్పటికీ రైస్‌ మిల్లర్లు ధాన్యం తీసుకు న్న తర్వాత ఇష్టానుసా రంగా కటింగ్‌ చేశారు. ధాన్యం తూకం వేసిన తర్వాత లారీతో పాటు అందులో ఎంత మంది రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో వివరాల జాబితాను పంపారు. రైస్‌ మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత ఎక్కువ తర్ర ఉందని తక్కువ రిసీవ్‌ చేసుకున్నట్లు పౌర సరఫరా అధికారులకు వివరాలు ఇ చ్చారు. సొసైటీల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా, రైస్‌మిల్లర్ల జాబితా ప్రకారం ప్ర భుత్వం డబ్బులు పంపింది. ఉదాహరణకు ఒక లారీ లో 40క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి డబ్బులు తక్కువగా వస్తే అందులో ఎంత మంది రైతుల ధాన్యం ఎంత ఉందో లెక్క తీసి సగటున డబ్బులు తక్కువగా ఇచ్చారు. రైతులే ఐదు కిలోల తరుగు ఇవ్వగా అదనంగా మరో ఐదు కిలోల పైనే తరుగు తీశారు. ఒక్క సావెల్‌ సొసైటీ పరిధిలోనే రూ. 23లక్షల వరకు తక్కువగా వచ్చాయి. మరో సొసైటీలో 530 బస్తాలకు సంబంధించి డబ్బులు రాలేదు. ఇలా జిల్లా వ్యా ప్తంగా రూ.10కోట్ల పైనే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. వేలల్లో డబ్బులు తక్కువగా రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైస్‌మిల్లర్లు ఇష్టానుసారంగా తరుగు తీసి తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు.


 రైతులకు న్యాయం జరిగేనా..?

 రైతులు తమకు జరి గిన అన్యాయం విషయ మై సావెల్‌ సొసైటీ రైతు లు డీసీవోకు ఈనెల 27న ఫిర్యాదు చేశారు. తమకు న్యా యం చేయాలని కోరారు. అయి తే, రైతులకు న్యాయం జరుగు తుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

Updated Date - 2020-08-01T11:28:38+05:30 IST