బాలల మనస్తత్వానికి అనుగుణంగా విచారణ చేయాలి

ABN , First Publish Date - 2020-12-31T04:45:41+05:30 IST

క్రిమినల్‌ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న బాలలను వారి మనస్తత్వానికి అనుగుణంగా మసులుకొని నేర విచారణ చేయాలని, అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి గౌతంప్రసాద్‌ తెలిపారు.

బాలల మనస్తత్వానికి అనుగుణంగా విచారణ చేయాలి
మాట్లాడుతున్న జడ్జి కిరణ్మయి

నిజామాబాద్‌  లీగల్‌, డిసెంబరు 30: క్రిమినల్‌ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న బాలలను వారి మనస్తత్వానికి అనుగుణంగా మసులుకొని నేర విచారణ చేయాలని, అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి గౌతంప్రసాద్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవా సదన్‌లో జరిగిన బాల న్యాయ చట్టంపై పోలీసులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక పరిస్థితులకు ప్రాధాన్యాన్ని పరిశీలించి విచారణ చేయాలని, పోలీసుగా కాకుండా వారిలో ఒకరిగా కలిసిపోయి విచారిస్తే భవిష్యత్తులో ఉత్తమ బాలలుగా తీర్చిదిద్దిన వారమవుతామని తెలిపారు. రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి నర్సారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మిగతా పౌరులతో స్నేహపూర్వకంగా ఉండే విధంగా బాలలను తీర్చిదిద్దాలని తెలిపారు. బాలల సం రక్షణ, సంక్షేమ చట్టాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చే శామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి కి రణ్మయి అన్నారు. మానసిక వైద్యులు కేశవులు, విశాల్‌ మాట్లాడుతూ బాలల మానసిక పరిస్థితిని అంచనా వేయడం, వారి ఆలోచనలను పరిశీలించడం సమాజంలోని అన్ని రకాల పరిస్థితులు వారిపై ఏ మేరకు ప్ర భావం చూపుతున్నాయన్న విషయాలను పోలీసు విచారణ అధికారులు అధ్యయనం చేయాలన్నారు. అదనపు పోలీస్‌ కమిషనర్‌ ఉషా విశ్వనాథ్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌కుమార్‌, బాలల న్యాయచట్టం గురించి విస్తృత అధ్యయనానికి శిక్షణ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు. బాలల న్యాయమండలి చైర్‌ పర్సన్‌, ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి కళార్చన బాల కార్మిక వ్యవస్థ  నిర్మూలన, బాలల న్యాయచట్టంలోని వివిధ అంశాలను తెలిపారు.కార్యక్రమంలో స్పెషల్‌ ఉమెన్స్‌ కోర్టు జడ్జి ఎం.డి.షౌకత్‌ జహాన్‌ సిద్దిఖి, సీనియర్‌ పీపీ రాంరెడ్డి, న్యాయవాదులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, మానిక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:45:41+05:30 IST