జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఐసీఎంఆర్‌ బృందం

ABN , First Publish Date - 2020-05-17T09:52:34+05:30 IST

జిల్లాలో శనివారం రెండో రోజు ఐసీఎంఆర్‌ బృం దం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేసిన 5 మండలాల్లోని ఐదు గ్రామాల్లో 200

జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఐసీఎంఆర్‌ బృందం

ఐదు మండలాల్లో 200 కుటుంబాల నుంచి రక్త నమూనాల సేకరణ


కామారెడ్డి, మే 16: జిల్లాలో శనివారం రెండో రోజు ఐసీఎంఆర్‌ బృం దం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేసిన 5 మండలాల్లోని ఐదు గ్రామాల్లో 200 కుటుంబాల నుంచి రక్త నమూ నాలను ఐసీఎంఆర్‌ బృందం సేకరించింది. ప్రతీ గ్రామంలో 40 కుటుం బాల నుంచి రక్త నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం చెన్నై వైరాలాజీ కేంద్రానికి పంపించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని డివిజన్‌ పరిధిలో మండ లాలను ఎంపిక చేశామని ఈ పరీక్షల వల్ల సమాజంలో కరోనా వైరస్‌ సంక్రమణకు ఎంత వరకు రోగ నిరోధకత కలిగి ఉన్నాం తదుపరి తీసు కోవాల్సిన జాగ్రత్తలు, జాతీయ పోషణ సంస్థ తదుపరి సూచనలకు, పరిశోధనలకు ఈ రక్త నమూనాలు దోహదం చేస్తాయని తెలిపారు.


రెండో రోజు శనివారం జిల్లాలోని జుక్కల్‌ మండలం చిన్నఎడ్గిలో 40 కుటుంబాలు, పిట్లం మండలం ధర్మారంలో 40 కుటుంబాలు, పెద్దకొడ ప్‌గల్‌ మం్డపేట్‌ మండలం జలాల్‌పూర్‌లో 40 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవిడ్‌ -19 వైద్యాధికారి షాహీద్‌అలీ, జిల్లా మాస్‌ మీడియా విభాగం అధికారి సంజీవరెడ్డి, రాణి, విఠల్‌రావు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-17T09:52:34+05:30 IST