కరోనాపై ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-10-31T06:30:48+05:30 IST
కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో సుదర్శనం అన్నారు

బోధన్‌రూరల్, అక్టోబరు 30 : కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో సుదర్శనం అన్నారు. శుక్రవారం బోధన్‌లోని రాకాసీపేట ఆరోగ్య కేంద్రంలో ఏర్పా టుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబరు 20 నుంచి ఇంటింటి సర్వే చేసి కరోనా కేసులను గుర్తించాలని పేర్కొన్నారు. కుష్ఠువ్యాధి నివారణపై ప్రజలు తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇచ్చారు. కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందస్తు చర్యల గురించి తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రేణుక, వైద్యాధికారులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.