డిగ్రీ కళాశాలకు మైదానం అప్పగిస్తాం

ABN , First Publish Date - 2020-12-12T04:40:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరి తహారం కార్యక్రమం విజయవంతం చేయాలని బోధన్‌ ఆర్డీవో రాజే శ్వర్‌ అన్నారు. శుక్రవారం ఆయన డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలిం చారు.

డిగ్రీ కళాశాలకు మైదానం అప్పగిస్తాం
ట్రీ పార్కును పరిశీలిస్తున్న ఆర్డీవో

బోధన్‌రూరల్‌, డిసెంబరు 11 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరి తహారం కార్యక్రమం విజయవంతం చేయాలని బోధన్‌ ఆర్డీవో రాజే శ్వర్‌ అన్నారు. శుక్రవారం ఆయన డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహరం నిర్వహణ కోసం తీసుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం మొక్కల పెంపకం తరువాత తిరిగి కళాశాలకు అప్పగిస్తామని అన్నారు. మున్సిపల్‌ కమి షనర్‌ నిర్వహించిన హరితహారం, మినీ పార్కులను, ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆసు పత్రి పక్కన ఏర్పాటుచేసిన ట్రీపార్కును సందర్శించారు. శక్కర్‌నగర్‌లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం, ఏఈ శివకృష్ణ, శ్రీ నివాస్‌, కౌన్సిలర్‌లు శరత్‌రెడ్డి, శ్రీధర్‌, రవి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పెంటకలాన్‌ గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని పల్లెప్రకృతి, అభివృద్ధి పనులను శుక్రవారం బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలలో మొక్కలను సక్రమంగా పెంచి సమయానికి అందించాలని సూచిం చారు. సర్పంచ్‌ రామన్న, గ్రామపెద్దలు తదితరులున్నారు. 

Updated Date - 2020-12-12T04:40:55+05:30 IST