30లోగా హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-07-28T10:46:26+05:30 IST

హరితహారం లక్ష్యాన్ని ఈనెల 30లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదే శించారు.

30లోగా హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27: హరితహారం లక్ష్యాన్ని ఈనెల 30లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదే శించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ చాం బర్‌లో వివిధ శాఖలకు నిర్దేశించిన హరితహారం లక్ష్యంపై సమీక్షించారు. గుర్తించిన స్థలాలు, రోడ్లు, చెరువు కట్టలపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, జి యో ట్యాగింగ్‌ పూర్తిచేసుకోవాలని అధికారులకు సూచిం చారు. కార్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా అటవీ అధి కారి వసంత, జిల్లా ఎక్సెజ్‌ అధికారి శ్రీనివాస్‌, వ్యవసాయ అధికారి సింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రైతువేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, పంచా యతీ ఇంజనీర్లు పనుల పర్యవేక్షణ నిరంతరం చేప ట్టాల ని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా రెవెన్యూ డివిజనల్‌ అధికార్లు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈ, ఏఈలతో రైతు వేదిక నిర్మాణ పనులను మండలాల వారీగా సమీ క్షించారు. రైతు కల్లాల పనులకు సంబంధించి ఇసుకకు ఎ లాంటి ఇబ్బంది లేకుండా తహసీల్దార్లు చర్యలు తీసుకో వాలని తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీలో ప్రకృతి వనా ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి నివేదిక సమర్పించాలని తెలిపారు. 

Updated Date - 2020-07-28T10:46:26+05:30 IST