రుణాల మంజూరు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-19T05:42:18+05:30 IST

లబ్ధిదారు లకు రుణాల మంజూరును వేగవంతం చేసి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని కలెక్టర్‌ శరత్‌ బ్యాంక్‌ మేనేజర్లు, బ్యాంక్‌ కంట్రోలింగ్‌ అధికారులకు సూచించారు.

రుణాల మంజూరు వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి, డిసెంబరు 18: లబ్ధిదారు లకు రుణాల మంజూరును వేగవంతం చేసి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని  కలెక్టర్‌ శరత్‌ బ్యాంక్‌ మేనేజర్లు, బ్యాంక్‌ కంట్రోలింగ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం జనహితభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఆర్థిక బలోపేతం కోసం అర్హులైన ప్రతీ ఒక్క లబ్ధిదారుడికి  రుణాన్ని అం దజేయాలన్నారు. 2020-21గాను ఎస్‌సీ యాక్షన్‌ప్లాన్‌ కింద రూ.23కోట్లతో537 మంది లబ్ధిదారులకు రుణ మంజూరుకు కమిటీలో ఆమోదించామని తెలిపారు. జిల్లా అధికారులు పెండెన్సిని పది కాపీ లు ముందుగానే బ్యాంక్‌ల వారీగా అం దజేయాలని తెలిపారు. 426 మెప్మా సంఘాలకు గాను రూ.27కోట్ల 69లక్షల రుణ మంజూరి సాధించి వందశాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మెప్మా ద్వారా వీధి వర్త కులకు సంబంఽధించి 7703 మందికి గాను 7200 మందికి రుణాలు అందించామని, మిగితా లక్ష్యాన్ని మున్సిపల్‌ కమి షనర్లు బ్యాంకర్ల సహకారంతో పూర్తి చేయాలని తెలిపారు. ఏవోలు, ఏఈవోలు క్షేత్రస్థాయిలో మండల, క్లస్టర్‌ల వారీగా రైతులను చైతన్య పరిచి పంట రుణాల రెన్యూవల్‌ చే యాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజన్‌ రాజేంద ర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ చంద్ర మోహన్‌రెడ్డి, నాబర్డ్‌ డీడీఎం నగేష్‌, బ్యాంక్‌ మేనేజర్‌లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read more