హరిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-06-26T11:14:43+05:30 IST

హరిత తెలంగాణ రాష్ట్రంగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి ని సంరక్షించాల్సిందేనని జడ్పీ

హరిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ


కామారెడ్డి, జూన్‌ 25: హరిత తెలంగాణ రాష్ట్రంగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి ని సంరక్షించాల్సిందేనని జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయ ఆవరణ లో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. భావితరాలకు కాలుష్యం నుంచి గట్టెక్కించాలని సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా పాల్గొని మొక్కలు నాటాలని అన్నారు. జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. కామారెడ్డి మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి మొక్కలు నాటారు.


ఈ కార్యక్రమంలో డీఈవో రాజు, గ్రామ పంచాయతీ సిబ్బం ది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం రాఘవాపూర్‌ శివారులో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో గీత పారిశ్రామిక సహకార సంఘం నెంబర్‌ 1 ఆధ్వర్యంలో ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత సంవత్సరం మూడు వేల ఈత మొక్కలను నాటగా.. ఈ సంవత్సరం ఐదువేల ఈత మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చందర్‌నాయక్‌, జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి, నారాయణ, కార్యాలయ సిబ్బంది, గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు గోపిగౌడ్‌, ఎక్సైజ్‌ సీఐ ఫణిందర్‌రెడ్డి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, గీత పారిశ్రామిక సంఘం డైరెక్టర్లు అబ్బగోని రమేష్‌గౌడ్‌, హరికిషన్‌ గౌడ్‌, రెడ్డిపేట వెంకటేష్‌గౌడ్‌, రామగౌడ్‌, దేవేందర్‌గౌడ్‌, బాలరాజు తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-06-26T11:14:43+05:30 IST