ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2020-10-31T06:31:41+05:30 IST
కనీస మద్దతు ధర కరువు, తీవ్ర వర్షాలతో నష్టపో యిన రైతులకు ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లించాలని బీఎస్పీ రాష్ట్ర నాయకు లు, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్‌రెడ్డి అన్నారు

బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్ కుమార్‌రెడ్డి
బాల్కొండ, అక్టోబరు30: కనీస మద్దతు ధర కరువు, తీవ్ర వర్షాలతో నష్టపో యిన రైతులకు ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లించాలని బీఎస్పీ రాష్ట్ర నాయకు లు, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవా రం బాల్కొండ మండలం వన్నెల్ (బి)లో మొక్కజొన్న కుప్పల ను ఆయ న పరిశీలించారు. ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యాలన్నారు. ఇప్పటికే రైతులు మొక్కజొన్నను రైతులకు విక్రయించి నష్ట పో యారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారని ప్రకటిం చారని క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. మండలానికి ఒక కొనుగోలు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేయాలన్నారు. మొ క్కజొన్న నాణ్యతను బట్టి అధికా రులు చెబుతున్నారని, ప్రభుత్వం ఎటువంటి ఆంక్షాలు లేకుండా మొక్కజొన్న కొనుగోలు చేయాలని సూచించారు. మాజీఎంపీటీసీ గాదేపల్లి రాజు, రాజేష్, చి న్నారెడ్డి, ప్రశాంత్, సాయన్న, రైతులు పాల్గొన్నారు.
రూ.10వేల ఆర్థిక సహాయం..
బాల్కొండ మండలం వన్నెల్(బి)కి చెందిన బోదాసు సతీష్ కుమార్ కు టుంబానికి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల బాల్కొండ మండల కేంద్రం లో ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సతీష్ కుటుం బాన్ని పరామర్శించారు. మృతుడికి భార్య, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. పేద కుటుంబానికి తన వంతు సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. మృతుడి భార్యకు సాను భూ తి తెలిపారు. అదే గ్రామానికి చెందిన దత్తుగుండె పోటుతో మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ఆయన వెంట సునీ ల్‌సేన నాయకులు, తదితరులు ఉన్నారు.