‘రైతుబంధు పథకం అందజేయాలి’

ABN , First Publish Date - 2020-03-12T11:42:30+05:30 IST

సీఎం కేసీఆర్‌ రైతులకు పంటల సాగు కోసం అందిస్తున్న రైతుబంధు పథకం అందడంలేదని కేశ్‌పల్లి రైతులు

‘రైతుబంధు పథకం అందజేయాలి’

జక్రాన్‌పల్లి, మార్చి11: సీఎం కేసీఆర్‌ రైతులకు పంటల సాగు కోసం అందిస్తున్న రైతుబంధు పథకం అందడంలేదని కేశ్‌పల్లి రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. బుధవారం కేశ్‌పల్లి గ్రామంలో ఏడీఏ వెంకటలక్ష్మీ, వ్యవసా యాధికారి దేవికతో కలిసి కేశ్‌పల్లి గ్రామరైతులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ పంటల సాగు కోసం రైతులు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుబంధు పథకం డబ్బులు రావడంలేదని వారు తెలిపారు. రెండు, నాల్గో విడత రైతుబంధు పథకం డబ్బులు రాకపోవడంతో తీవ్రంగా పెట్టుబడి సహాయాన్ని నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ఈవిషయంలో అధికా రులు చోరవ తీసుకొని రెండు, నాల్గో విడత రైతు బంధు పెట్టుబడి సాయం అందేలా చూడాలని కేశ్‌పల్లి గ్రామ రైతులు అధికారులను కోరారు. కార్య క్రమంలో సర్పంచ్‌ మైదం మహేశ్వర్‌, ఉపసర్పంచ్‌ బాస్కర్‌, ఎంపీటీసీ గంగాధర్‌, వీడీసీచైర్మన్‌ జేసీ గంగారాం, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు పోతన్న, వీడీసీసభ్యులు, రైతులు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T11:42:30+05:30 IST