హరిత పండుగ

ABN , First Publish Date - 2020-06-21T11:08:24+05:30 IST

తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో హరితహార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతీ ఏట ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది.

హరిత పండుగ

మిషన్‌ హరితహారంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు

ఈ నెల 25 నుంచి పండుగ వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమం

జిల్లా లక్ష్యం 65 లక్షల మొక్కలు     

ఇప్పటికే ప్రభుత్వ శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం    

34 శాఖల వారీగా మొక్కల పెంపకానికి ప్రణాళిక   

జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు    

మొక్కల పరిరక్షణ బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదే..


కామారెడ్డి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో హరితహార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతీ ఏట ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమంపై సమీక్షించి మొక్కల పెంపకంపై దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిత మిషన్‌పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌కు కసరత్తు చేస్తున్నారు. హరిత హార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ నెల 25 నుంచి జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలో ఈ ఏడాది 65 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదే అంటూ చట్టాలను సైతం గత ఏడాదే సవరించిన విషయం తెలిసిందే.


జిల్లా లక్ష్యం 65 లక్షల మొక్కలు

రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని 2015 జూలైలో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఐదు విడతలుగా నిర్వహించారు. ఆరో విడత హరితహార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 6వ విడత కింద కామారెడ్డి జిల్లాలో 65,08,030 మొక్క లను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రస్తుతానికి ఎలాంటి బెంగలేదు. అయితే ప్రకృతి సమతుల్యం సరిగ్గా ఉంటే కాలానికి అనుగుణంగా మొక్కలు నాటనున్నారు. ప్రధానంగా జూన్‌లో వర్షాకాలం మొదలైన తరువాత చిరుజల్లులు పడుతుండడంతో మొక్కల పెంపకం వైపు అందరు దృష్టి సారించారు. ప్రధానంగా పచ్చదనం ఆశించిన స్థాయిలో పెంచడం ద్వారా ప్రకృతి సమతుల్యం కాపాడాలన్నా విశ్వాసం ప్రజల్లో వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వర్షాలు సమృద్ధి గా కురుస్తుండడంతో ఇక మొక్కల పెంపకంపై పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు.


మొక్కలు నాటేందుకు యాక్షన్‌ప్లాన్‌

గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు పచ్చ దనంతో నిండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారంపై జిల్లా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. మొక్కలు నాటడంపై ప్రత్యేక ప్రణాళికలో భాగంగా జిల్లా అధికా రులు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌లతో పాటు ప్రజాప్రతినిధులు జిల్లాస్థాయి అధికారులతో ఇప్పటికే సమీక్షించి ప్రణాళిక కార్యక్ర మాన్ని రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇంటింటా మొక్కలను పంపిణీ చేయడం కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో, 526 గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో రోడ్లకు ఇరువైపులా, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టను న్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక ప్రకారం జిల్లాలోని అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టనున్నారు.


శాఖల వారీగా లక్ష్యాలు

జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఆయా ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశిం చారు. డీఆర్‌డీఏ శాఖకు 4 లక్షల  మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టారు. అదేవిధంగా అటవీశాఖకు 7 లక్షలు, ఎక్సైజ్‌ శాఖకు 1.50లక్షలు, కామారెడ్డి మున్సిపాలిటీలో 4లక్షలు, బాన్సువాడ మున్సిపాలిటీలో 1.81 లక్షలు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 83వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. వ్యవసాయశాఖకు 7 లక్షలు, జిల్లా మార్కెటింగ్‌ 2 వేలు, ఆర్‌అండ్‌బీ శాఖలకు 1000 మొక్కల చొప్పున లక్ష్యాన్ని కేటాయించారు. ఉద్యానవనశాఖకు 37 వేలు, విద్యుత్‌శాఖకు 25వేలు, బీసీ సంక్షేమశాఖకు 2వేలు, మత్స్యశా ఖకు 500, జాతీయరహదారిలోని నవయుగ సంస్థకు 4000, పౌరసరఫరాల శాఖకు 5వేలు, డీపీవోకు 5 వేలు, విద్యాశాఖకు 50 వేలు, నీటిపారుదల శాఖకు 60 వేలు, వైద్య ఆరోగ్యశాఖకు 60వేలు, మిషన్‌భగీరథ శాఖకు 10వేలు, ఎస్సీ సంక్షేమశాఖకు 2వేలు, పరిశ్రమలశాఖకు 5వేలు, పంచాయతీరాజ్‌ శాఖకు 5 వేలు, పోలీసు డిపార్ట్‌మెంట్‌ 2వేలు, ఆర్టీసీ 1000, సహకార శాఖ 2వేలు, రెవెన్యూ 1000, ప్రభుత్వ కార్యాలయాలు 1000 ఇలా మొత్తం 34శాఖల ద్వారా 65లక్షల వరకు మొక్కలు నాటేందుకు లక్ష్యాలను నిర్ధేశించారు. 


హరితహారంపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 33 శాతం మేరకు అడవులు పెంచాలనే ఆలోచనతో హరితహారం కార్యక్రమం చేపడుతుండగా ముఖ్యమంత్రి దీనిని ప్రతిష్ఠాత్మకం గా తీసుకోవాలని దిశానిర్ధేశం చేశారు. నాటిన వాటిలో 85శాతం మొక్కలు దక్కేలా చర్యలు తీసుకోవాలని అందుకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్‌లు, చైర్మన్‌లతో పాటు అధికారులు బాధ్యత వ్యహించాలని లేదంటే కొత్త పంచాయతీరాజ్‌ మున్సిప ల్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది నాటిన మొక్కలపై నిర్లక్ష్యం వహించిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు హరితహారం మొక్క లు నాశనం చేసిన వారికి భారీగా జరిమానాలు విధించిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది 65లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోగా ఈనెల 25 నుంచి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరై ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-06-21T11:08:24+05:30 IST