పంట రుణాల పంపిణీ అంతంతే!

ABN , First Publish Date - 2020-12-27T04:59:32+05:30 IST

యాసంగి సీజన్‌ మొదలై రెండు నెలలు గడిచినా నిజామాబాద్‌ జిల్లాలో నేటికీ రుణ పంపిణీ ఊపందుకోలేదు. నిర్ణయించిన లక్ష్యానికి చేరుకోలేదు. గత వానాకాలం రుణపంపి ణీ లాగానే యాసంగిలో కూడా కొనసాగుతోంది. గ్రామీణ ప్రా ంతాల్లో రీషెడ్యూల్‌పైన దృష్టిపెట్టడం వల్ల ఎక్కువ మొత్తం లో రైతులకు రుణాలు అందడం లేదు. కొత్త రైతులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. బ్యాంకుల శాఖల వారీగా టార్గెట్‌లు ఇచ్చినా.. ఏ శాఖలోనూ పూర్తిస్థాయిలో లక్ష్యాల ను చేరుకోలేదు.

పంట రుణాల పంపిణీ అంతంతే!

నిజామాబాద్‌ జిల్లాలో నేటికీ లక్ష్యాన్ని చేరుకోని పంట రుణాల పంపిణీ

ఈ యాసంగిలో ఇవ్వాల్సిన రుణాలు రూ.1,368  కోట్లు  

ఇప్పటి వరకు ఇచ్చింది రూ.376 కోట్లే 

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

నిజామాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగి సీజన్‌ మొదలై రెండు నెలలు గడిచినా నిజామాబాద్‌ జిల్లాలో నేటికీ రుణ పంపిణీ ఊపందుకోలేదు. నిర్ణయించిన లక్ష్యానికి చేరుకోలేదు. గత వానాకాలం రుణపంపి ణీ లాగానే యాసంగిలో కూడా కొనసాగుతోంది. గ్రామీణ ప్రా ంతాల్లో రీషెడ్యూల్‌పైన దృష్టిపెట్టడం వల్ల ఎక్కువ మొత్తం లో రైతులకు రుణాలు అందడం లేదు. కొత్త రైతులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. బ్యాంకుల శాఖల వారీగా టార్గెట్‌లు ఇచ్చినా.. ఏ శాఖలోనూ పూర్తిస్థాయిలో లక్ష్యాల ను చేరుకోలేదు. 

లక్ష్యం రూ.1,368 కోట్లు

నిజామాబాద్‌ జిల్లాలో ఈ యాసంగిలో అందరు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగి లో మొత్తం రూ.1,368 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా బ్యాంకు శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేయాలని కోరారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో పలుమార్లు ఆయా  బ్యాంకు శాఖల అధికారులతో సమీక్షించారు. జనవరి లోపు ల క్ష్యాల్లో 70 శాతానికిపైగా రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసు కున్నారు. జిల్లాలో యాసంగి పంటలు అక్టోబరుతో మొదలై ఏ ప్రిల్‌తో పూర్తవుతాయి. ఆరుతడి పంటలను అక్టోబరు నెలలో రైతులు సాగుచేయగా వరి డిసెంబరు, జనవరి నెలల్లో ఎక్కు వగా సాగుచేస్తున్నారు. జిల్లాలో ఈ యాసంగిలో కూడా 5.13  లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటికే 2 లక్షల ఎకరాల వరకు ఆరుతడి పంటలతో పాటు వరిని సాగుచేశారు. జ నవరి నెలలో మొత్తం మూడున్నర లక్షల ఎకరాలకుపైగా వ రిని సాగు చేయనున్నారు. ఇప్పటికే వరి నారుమళ్లను సిద్ధం చేసిన రైతులు నాట్లను మొదలుపెట్టారు. గత సంవత్సరం వానాకాలంలో మూడున్నర లక్షల వరి సాగు కాగా ఈ సంవత్సరం 3.75 లక్షల ఎకరాలకుపైగా వరి సాగుఅవుతుందని అంచనా వేశారు. పంటలు పెట్టే సమయంలోనే రైతులకు ఎ క్కువగా డబ్బులు అవసరమవుతాయి. వానాకాలం పంటల డబ్బులు కొన్ని ఉన్నా మొత్తం పెట్టుబడికి సరిపోకపోవడంతో రైతులు రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే వానాకాలంలో ఎక్కువ వంది రైతులు రు ణాలు తీసుకుంటుండగా యాసంగిలో మాత్రం తక్కువ రు ణాలు తీసుకుంటున్నారు. రుణ లక్ష్యానికి అనుగుణంగా ఈ యాసంగిలో 1,368 కోట్ల రూపాయలను రుణాలు ఇవ్వాలని  నిర్ణయించగా.. ఇప్పటి వరకు కేవలం 376 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఈ రెండు నెలల్లో 34 వేల మంది రైతులకు ఆయా బ్యాంకుల ద్వారా రుణ పంపిణీ చేశారు. యాసం గిలో రుణాలు తీసుకునేందుకు అక్టోబరు నుంచి మార్చి వర కు అవకాశం ఉన్నా రైతులు ఎక్కువగా మొదటి మూడు నెల లే రుణాలు తీసుకుంటారు. ఆ తర్వాత రెండు నెలలు పెద్దగా తీసుకునేందుకు ముందుకు రారు. ప్రభుత్వ ఆదేశాలకు అను గుణంగా ఈ మూడు నెలల్లోనే 70 శాతానికిపైగా రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటి వరకు అ నుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. 

కలెక్టర్‌ ఆదేశించినా ఫలితం శూన్యమే..

కలెక్టర్‌ నారాయణరెడ్డి పలుమార్లు సమీక్షించి ప్రతీ బ్యాం కు లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించినా ఫలితం కనిపించలేదు. బ్యాంకు పరిధిలో రైతులను గుర్తించి కొత్త రుణాలను ఇ వ్వాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో రైతులకు అధికారుల ద్వారా రుణ పంపిణీపై వివరించారు. చాలా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా ఎక్కువగా రీషెడ్యూ లే చేస్తున్నారు. వానాకాలం తీసుకున్న రుణాలకు వడ్డీ కట్టి రీషెడ్యూల్‌ను చేస్తున్నారు. కొంత మంది రైతులు మాత్ర మే పాత రుణాలను కట్టి కొత్త రుణాలను తీసుకుంటున్నారు. 

రుణాలు తిరిగికట్టేందుకు రైతుల వెనకడుగు

తీసుకున్న రుణాలను తిరిగి కట్టేందుకు కూడా కొంత మంది రైతులు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడం వల్ల పాత రుణాల ను కడితే కొత్త రుణాలు రావని భావిస్తున్నారు. అధికారులు కూడా రుణాలు చెల్లించిన రుణ మాఫీ వర్తిస్తుందని వివరిస్తున్నారు. జిల్లాలో జనవరి నెలలో ఎక్కువగా రుణ పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ నెలలో ఎక్కువ మొత్తంలో రైతులకు రుణపంపిణీ చే యనున్నారు. ప్రతీ బ్యాంకు పరిధిలో రైతుల పట్టాదార్‌ పాస్‌పుస్తకం ఆధా రంగానే రుణాలు ఇస్తున్నారు. కొన్ని బ్యాంకులు రైతుల పట్టాదార్‌ పాస్‌బుక్కులను తమ వద్దనే ఉంచుకొని రుణపంపిణీ చేస్తున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చినా మళ్లీ ఇతర బ్యాంకుల్లో నుంచి రుణాలు తీసుకోకుండా ఉండేందుకు పట్టా బుక్కులను తీసుకుంటున్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణ పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా రైతులకు పంట రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జయసంతోషి తెలిపారు. బ్యాంకుల పరిధిలో ఆయా గ్రామాల రైతులకు యా సంగిలో రుణాలు అందే విధ ంగా చూస్తున్నామన్నారు. ప్రతీ బ్యాంకు పరిధిలో లక్ష్యానికి అనుగుణం గా రుణ పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు.

Updated Date - 2020-12-27T04:59:32+05:30 IST