పండుగ వేళ.. ఫీజుల పడగ

ABN , First Publish Date - 2020-10-19T10:02:51+05:30 IST

కరోనా కష్టకాలంలో ఖర్చులు పెరిగి ఆదాయం లేక సా మాన్యులు ఇబ్బందులు పడుతుండగా.. ఫీజులు కట్టమం టూ ప్రైవేట్‌ పాఠశాలల ఆదేశాలు కంటిమీద కునుకు లే కుండా చేస్తున్నాయి.

పండుగ వేళ.. ఫీజుల పడగ

సామాన్యులకు తప్పని స్కూలు ఫీజుల భారం

సర్కారు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రైవేట్‌ పాఠశాలల ఇష్టారాజ్యం

త్రైమాసిక పరీక్షల పేరుతో ఫీజుల వసూలు

పండుగ వేళ తీవ్ర ఇబ్బందుల్లో తల్లిదండ్రులు


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 18: 

కరోనా కష్టకాలంలో ఖర్చులు పెరిగి ఆదాయం లేక సా మాన్యులు ఇబ్బందులు పడుతుండగా.. ఫీజులు కట్టమం టూ ప్రైవేట్‌ పాఠశాలల ఆదేశాలు కంటిమీద కునుకు లే కుండా చేస్తున్నాయి. అసలే గత ఆరు నెలలుగా ఉద్యోగా లు లేక ఆదాయం అంతంత మాత్రంగా ఉండి కుటుంబపోషణనే కష్టంగా మారుతున్న సమయంలో దసరా పం డుగ వచ్చి సామాన్యుడు పండుగ జరుపుకోలేని పరిస్థితు ల్లో ఫీజుల భారం సామాన్యుడికి కష్టంగా మారుతోంది. ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వడంతో ప్రైవేట్‌ పాఠశాలలు అదే అదునుగా విద్యార్థు ల నుంచి ఫీజుల వసూళ్లకు శ్రీకారం చుట్టాయి. సెప్టెంబ రు మొదటి వారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన ప్రైవేట్‌ పాఠశాలలు అప్పటి నుంచే ఫీజుల వసూళ్ల కు ఆదేశాలు ఇచ్చాయి. కొన్ని పాఠశాలల్లో పుస్తకాలతో పా టు ఫీజులు వసూలు చేయగా కొన్ని పాఠశాలలు సెప్టెంబరు నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. నెలవారి ఫీజుల వసూలు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు కట్టాలంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా త్రైమాసిక పరీక్షల పేరుతో ఫీజులు కడితేనే పిల్లలకు పరీక్షలకు అనుమతి ఇస్తామంటూ ఆదే శాలు జారీచేస్తూ మరి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇ ప్పటికే జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రైవేట్‌ పా ఠశాలలు ఫీజుల వసూలుకు కఠిన ఆదేశాలు జారీచేయ గా దీనిపై విద్యార్థి సంఘాలు సైతం జిల్లా ఉన్నతాధికారు లకు ఫిర్యాదు చేశాయి. 


ఫీజు కట్టకుంటే ఆన్‌లైన్‌ క్లాసులు బంద్‌

సెప్టెంబరు మొదటి వారంలో ఆన్‌లైన్‌ తరగతులకు అ నుమతి రావడంతో ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజుల వసూలు కు ఆదేశాలు ఇచ్చాయి. కొన్ని పాఠశాలలు జూలై, ఆగస్టు నెలల్లోనే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించినప్పటికీ సెప్టెంబరు తర్వాత ఫీజుల వసూలుకు ఆదేశాలు ఇచ్చాయి. ప్ర భుత్వ ఆదేశాల ప్రకారం నెలవారీ ఫీజు వసూలుకు కొంత సడలింపు ఇవ్వడంతో అదే అదునుగా ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల వసూలుకు ఆదేశా లు ఇవ్వడం ప్రారంభించారు. కొన్ని పాఠశాలలు 3 నెలల ఫీజును ఒకేసారి కట్టుమంటుండగా మరికొన్ని పాఠశాల లు నెలవారీ ఫీజులు వసులు చేస్తున్నారు. నగరంలోని కొ న్ని పేరొందిన పాఠశాలలు విద్యార్థుల నుంచి 4 నెలల ఫీ జులను ఒకేసారి వసూలు చేస్తున్నారు. కరోనా కష్టకాలం లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు వా రి పిల్లల భవిష్యత్తును సాకుగా చూపుతూ భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని హాజరుశాతం వేయమని చె బుతూ బలవంతంగా ఫీజులు వసులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని పాఠశాలలు ఫీజులు కడితేనే ఆన్‌లైన్‌ తరగతులకు లింకులు ఇస్తున్నట్లు సమాచారం. 


పండుగ వేళ సామాన్యుడి కష్టాలు

కరోనా కష్టకాలం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతు న్న సామాన్యుడికి ప్రైవేట్‌ పాఠశాలల ఫీజు భారంగా మా రింది.  ఒక్కో విద్యార్థికి పుస్తకాల కోసం రూ.3వేల నుంచి రూ.4వేలు ఖర్చు కాగా ఇప్పుడు ఫీజుల పేరుతో ఒక్కొక్కరికి రూ.5 వేలు కట్టమంటూ ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఆదేశాలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక  విద్యా ర్థి ఉన్న కుటుంబం ఎలాగోలా అప్పుచేసో ఫీజులు కడుతు ంటే ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న కుటుంబం తీవ్ర ఆర్థిక ఇ బ్బందులను ఎదుర్కొంటోంది. పండుగ వేఽళ పిల్లలకు  కనీసం కొత్త బట్టలు కొనివ్వలేని పరిస్థితుల్లో ఫీజుల భారం మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు బలవంతంగా వసూలు చేయవద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ ప ట్టించుకోకుండా విద్యార్థులకు హాజరు శాతం, అసైన్‌మెం ట్‌, పరీక్షలు రాయనివ్వమంటూ బెదిరింపులకు గురిచేస్తూ ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బలవంతపు ఫీజుల వ సూళ్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు ఇలాగే కొనసాగితే ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.


ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు..డీఈవో దుర్గాప్రసాద్‌

ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజులు బలవంతం గా వసూలు చేయవద్దనే ఆదేశాలు ఉన్నాయి. గత సంవత్సరం ఏ ఫీజులు తీసుకున్నారో అ దే  ఫీజులు తీసుకోవాలి. కేవలం నెలవారీ ఫీ జులు మాత్రమే వసూలు చేయాలి. బలవంతంగా ఫీజులు వసూలు చేయవద్దని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలను అతిక్రమించి ఫీజులు వసూలు చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. బలవంతపు ఫీజు వసూళ్లపై ఎవరూ ఫిర్యాదు చేసినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2020-10-19T10:02:51+05:30 IST