గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-12-31T05:21:10+05:30 IST
మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామ శివారులోని కంపలగండి దగ్గర నిజాంసాగర్ మెయిన్ కెనాల్ డిస్ర్టిబ్యూటర్ నెంబర్ 27 సమీ పంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్సై హబీబ్ తెలి పారు.

నస్రుల్లాబాద్, డిసెంబరు 30: మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామ శివారులోని కంపలగండి దగ్గర నిజాంసాగర్ మెయిన్ కెనాల్ డిస్ర్టిబ్యూటర్ నెంబర్ 27 సమీ పంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్సై హబీబ్ తెలి పారు. సుమారు 60 నుంచి 65 ఏండ్ల వయస్సు ఉంటుందని, ఆకుపచ్చని చీర ధరించి ఉందని, శవం కుళ్లిపోయిందన్నారు. రెవెన్యూ అధికారి పండరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవాన్ని పంచనామా చేసి, పోస్టుమార్టం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.