‘బీడీ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలి’

ABN , First Publish Date - 2020-11-27T05:45:36+05:30 IST

‘బీడీ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలి’

‘బీడీ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలి’

పెద్దబజార్‌, నవంబరు 26: జీఎస్టీ నుంచి బీడీ పరిశ్రమ కు మినహాయింపు ఇవ్వాలని బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట  ఏఐసీటీయూ, బీఎల్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, బీకేఎస్‌, ఐఎఫ్‌టీయూ (కె) ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి తిలక్‌గార్డెన్‌, బస్టాండ్‌ మీదుగా స్టేషన్‌రోడ్‌, కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కేంద్రప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల సమ్మెకాల నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టారన్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఇచ్చిన చట్టాలను కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను పూర్తిగా రద్దుచేసి 44 చట్టాలను 4 కోడ్‌లుగా విభజించి కార్మికులు 8 గంటల  ప నిని 12, 13 గంటలు చేయడాన్ని నిరసిస్తూ రెండు నెలల ముందే నోటీసు ఇచ్చామన్నారు. ఇకనైనా ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం దిగివచ్చి నిత్యావసర ధరలను తగ్గించి కార్మికుల కు కనీస వేతనం రూ.24 వేలకు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పేద ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌రూం కట్టించాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చే యాలని అందరికీ పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాం కల్పించాలని పెన్షన్‌ రూ.12 వేల పెంచి ఇవ్వాలని, లేదంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌  నాయకులు రాజేంధర్‌, సిద్దిరాములు, బీఎల్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు, జిల్లా కన్వీనర్‌ జగదీష్‌, కోకన్వీనర్‌ సయ్యద్‌, బీడీ టేకేదార్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాస్‌, శంకర్‌, రమేష్‌ పాల్గొన్నారు.  


Read more