పనులన్నీ పక్కాగా చేపట్టాలి : కలెక్టర్‌ నారాయణరెడ్డి

ABN , First Publish Date - 2020-12-11T04:58:20+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిర్వహిస్తు న్న పనులన్నీ పక్కాగా జరిగేలా చూడాలని గ్రామ కార్యదర్శులు అన్ని రకాల పనులను పర్యవేక్షించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారు లను ఆదేశించారు.

పనులన్నీ పక్కాగా చేపట్టాలి :  కలెక్టర్‌ నారాయణరెడ్డి


ఉపాధి హామీ పనులపై  సెల్‌ కాన్ఫరెన్స్‌లో సమీక్ష 

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 10:  జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిర్వహిస్తు న్న పనులన్నీ పక్కాగా జరిగేలా చూడాలని గ్రామ కార్యదర్శులు అన్ని రకాల పనులను పర్యవేక్షించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారు లను ఆదేశించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వా రా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీ వోలు, డీఆర్‌డీవో ఇతర అధికారులతో పలు అంశా లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు సగం విధులు పంచాయతీలకు, మిగతా సగం విధులు జాతీయ ఉ పాధి హామీ పథకానికి కేటాయించాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర సంయుక్త కార్యద ర్శి బృందం జిల్లాలో కొనసాగుతున్న పనులను రెం డుమూడు రోజుల్లో పరిశీలించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో అన్ని పనులను సం బంధిత 7 రిజిష్టర్‌లో ఇప్పటి వరకు నమోదు చే యాలని ఆదేశించినప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ ప నులు పూర్తికాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులన్నీ రెండు రోజుల్లో పూర్తిచేయాలని, లేదంటే ఇబ్బందులు తప్పవన్నారు. గ్రామ కార్యదర్శి అంటే గ్రామానికి నోడల్‌ అదికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని గ్రామానికి సంబంధించిన ఇతర విధులతో పాటు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత అతనిపై ఉందన్నారు. ఈ విషయంలో ఎంపిడివోలు మండల  స్థాయిలో ప్రొగ్రాం ఆఫీసర్‌గా ఉంటూ గ్రామాల్లో జరుగుతున్న పనులపై పర్యవేక్షణ చేయాలన్నారు.  వెంటనే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అన్ని రికార్డులను అప్‌డేట్‌ చేయాలని, హరితహారం మొక్కలను ఎండిపోకుండా చూడడంతో పాటు వాటి రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వన సేవకులతో మాట్లాడి వారి విధులపై స్పష్టత ఇవ్వాలని, డ్రైయింగ్‌  ప్లాట్‌ఫాంల ను వెంటనే  పూర్తిచేయాలన్నారు. ప్రతి మండలం లో తప్పనిసరిగా కనీసం పది శాతం కూలీలు హాజరయ్యే విధం గా చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో ఎప్పటికప్పుడు  పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నా రు. సోమవారం నుంచి ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి ఈ పనులను పర్యవేక్షించడం జరుగుతుంద ని, ఎక్కడైనా తేడా వస్తే ఉపేక్షించేది లేదని ఆ యన స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు. మండల ప్రత్యేక అదికారులుగా విధులు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో పర్యటించి పనులను పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ఈ సెల్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ లత, డీఆర్డీవో శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T04:58:20+05:30 IST