పిల్లల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ చూపాలి

ABN , First Publish Date - 2020-12-11T05:25:17+05:30 IST

పిల్లల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ భవ్యమంజరి సూచించారు.

పిల్లల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ చూపాలి
అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కల్పిస్తున్న గృహ విజ్ఞాన శాస్త్రవేత్త

వర్ని, డిసెంబరు 10: పిల్లల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ భవ్యమంజరి సూచించారు. పోషకాహారంపై మండలం పొట్టిగుట్టతండా అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం అవగాహన కల్పించారు. పిల్లలకు సోయా, సిరిధాన్యాలతో తయారుచేసిన పోషకాహారం అందజేయాలని సూచించారు. భారతదేశంలో 60 శాతం మంది మూడేళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. పోషకాహార లోపంతో చిన్నపిల్లల్లో కలుగనున్న ఆరోగ్య సమస్యలను  వివరించారు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, పీచు పదార్థాలను పిల్లలకు అందించాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. 

Updated Date - 2020-12-11T05:25:17+05:30 IST