రివాల్వింగ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-04T04:17:16+05:30 IST
ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా అందిస్తున్న రివాల్వింగ్ ఫండ్‌ను మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు.

నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 3: ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా అందిస్తున్న రివాల్వింగ్ ఫండ్‌ను మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్ లో మత్స్య శాఖ ఏర్పాటు చేసిన రివాల్వింగ్ ఫండ్ పంపి ణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రూ.50 లక్షల చె క్కులను 16 సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘంలో వందకుపైగా సభ్యులు ఉన్న సంఘానికి రూ.5 లక్షలు, తక్కువ ఉన్న సంఘానికి రూ.3 లక్షల అందిస్తుందన్నారు. కష్టపడి పనిచేస్తే పది మందికి ఉపాధి కల్పిస్తారని, కు టుంబం అభివృద్ధి చెందాలంటే కష్టపడాలన్నారు. ప్ర భుత్వం నుంచి అందించిన సహాయం నుంచి సంఘాలకు ఏ విధంగా ఆదాయం సమకూర్చుకోవాలో ఆలో చన చేస్తూ వ్యాపారం చేస్తూ ముం దుకు వెళ్లాలన్నా రు. వ్యాపారంలో మనస్సు పెట్టి పనిచేస్తే ఎదుగుతామని మొదట కష్టపడ్డ వారే ఈరోజు పెద్దపెద్ద స్థాయి ల్లో ఉన్నారన్నారు. మనిషికి గొప్ప ఆలోచన శక్తి ఉం దని దానిని వ్యాపారంలో పెడితే ప ది మందికి ఉపాఽ ది కల్పించి మంచి స్థానంలో ఉంటా రన్నారు. మహి ళా మత్స్యకారులకు వ్యాపారం ప్రారంభించేందుకు వీ లు కల్పిస్తుందని నిజాయితీగా పనిచేస్తున్న సంఘాలు వంద శాతం అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి కో సం పనిచేసే వాళ్లనే ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు, ద్విచక్రవాహనాలను అంది స్తుందని, ప్రభుత్వం అందిస్తున్న ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ ఇన్‌ఛార్జి దేవేందర్, మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కోఆపరేటివ్ డైరెక్టర్ ఆనంద్ తదతరులు పాల్గొన్నారు.